ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్రపంచ‌దేశాల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. ప్ర‌స్తుతం అన్ని దేశాలు వ్యాప్తిచెందింది. ఈ క్ర‌మంలోనే ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56 ల‌క్ష‌లు దాట‌గా..  3.52 ల‌క్ష‌ల మంది క‌రోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించారు. దీంతో అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. 

 

ఉద్యోగులు సైతం ఇంటి నుంచే వ‌ర్క్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నెట్‌వ‌ర్క్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో జియో ఫైబర్ వార్షిక ప్లాన్లపై ఏకంగా డబుల్ డేటాను అందిస్తూ.. యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. బ్రాంజ్ ప్లాన్ నుంచి టైటానియం ప్లాన్ వరకు అన్ని ప్లాన్లపై డబుల్ డేటాను అందించనున్నారు. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్ సైట్ లో కూడా మార్పులు చేసింది. కానీ, దీనికి వార్షిక సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు మీరు బ్రాంజ్ ప్లాన్ తో వార్షిక రీచార్జ్ చేసుకుంటే మీకు 350 జీబీ డేటా పొందొచ్చు. 

 

బేస్ ప్లాన్ 100 జీబీ నెలవారీ డేటా మీకు అదనంగా లభిస్తుంది. ఒకవేళ మీరు నెలవారీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే 100 జీబీ ప్లాన్ బెనిఫిట్, 100 జీబీ లాక్ డౌన్ డబుల్ డేటా బెనిఫిట్, 50 జీబీ ఇంట్రడక్టరీ డేటా లాభాలు లభిస్తాయి. అంటే మొత్తంగా 250 జీబీ అన్నమాట. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నియమాలు క్రమంగా ఎత్తివేస్తున్నందున ఈ డబుల్ డేటా లాభాలు త్వరలో ముగియనున్నాయి. కాగా, బ్రాంజ్ ప్లాన్ తరహాలోనే.. జియో ఫైబర్ సిల్వర్ ప్లాన్ ద్వారా వార్షిక రీచార్జ్ చేసుకుంటే 800 జీబీ, గోల్డ్ ప్లాన్ ద్వారా నెలకు 1,750 జీబీ డేటా లభించనుంది. ఇక డైమండ్ ప్లాన్ ద్వారా 4000 జీబీ డేటా, ప్లాటినం ప్లాన్ ద్వారా 7500 జీబీ డేటా పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: