యూట్యూబ్.. నేటి త‌రంలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని యాప్‌. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ యూట్యూబ్‌ను వినియోగిస్తున్నారు. ఇలా మొబైల్ వాడకం ఎంత పెరిగిందే యూట్యూబ్ వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింద‌ని చెప్పుకోవాలి. మ‌రియు ఇంటర్నెట్ సేవలు కూడా అతి తక్కువ ధరకే రావటంతో యూట్యూబ్ వినియోగం రెట్టింపు అయింది. చదువుకు సంబంధించిన అంశాల దగ్గర్నుంచి ఏదైనా నేర్చుకోవడం, మ్యూజిక్, ఆరోగ్యం, వంటలు.. ఇలా రకరకాల అవసరాల కోసం నెటిజన్లు యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా భార‌త్‌లో అయితే చెప్పాల్సిన ప‌ని లేదు.

 

అయితే యూట్యూబ్ ఎన్నో ఫీచ‌ర్లు ఉన్నాయి. అలాగే వాటిలో బ్యాక్ గ్రౌండ్ ప్లేబ్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫీచర్ తో మీరు ఒక వీడియోను చూస్తున్నప్పుడు మరొక యాప్ కి నావిగేట్ చేసినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో వీడియోను ప్లే చేస్తూనే ఉంటుంది. యూట్యూబ్ యొక్క ప్రీమియం సభ్యత్వం లేకపోయినప్పటికీ వీడియో / ఆడియోను ఆటోమ్యాటిక్ గా ప్లే చేయడం మరియు పాజ్ చేయడం వంటివి చేసుకోవ‌చ్చు. మ‌రి ఇందుకు ముందుగా.. మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేయండి.

 

ఇప్పుడు యూట్యూబ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీరు బ్యాక్ గ్రౌండులో ప్లే చేయదలిచిన వీడియోను ఎంచుకోండి. ఆ త‌ర్వాత‌ కుడివైపు ఎగువ మూలలో గల మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అందులో డెస్క్‌టాప్ మోడ్‌ను ప్రారంభించండి. దీని తరువాత వెబ్‌సైట్ మళ్లీ లోడ్ అయ్యే వరకు వేచి ఉండి ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు విండోను చిన్నదిగా చేసి ఫోన్ లోని నోటిఫికేషన్ ప్యానెల్ ను ఓపెన్ చేయండి. ఇందులో ప్లేబ్యాక్ నోటిఫికేషన్ కోసం చూడండి. ప్లేబ్యాక్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్లే బటన్‌పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది. దీంతో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా మీరు మీకు ఇష్టమైన సాంగ్స్‌ను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఆనందించ‌వ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: