ఫేసుబుక్ సంస్థ అతి త్వరలోనే వెన్యూ(Venue) అనే అప్లికేషన్ ను విడుదల చేయబోతోంది. ఈ అప్లికేషన్ ద్వారా అనేక ఈవెంట్ల, కార్యక్రమాల, క్రీడా పోటీల ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అయితే ఈ ఆప్ లో సెకండ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ ద్వారా వీక్షకులు ఈవెంట్లను చూస్తూనే తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అలాగే పోల్ సర్వేలను కూడా నిర్వహించవచ్చు. ఈవెంట్ కార్యక్రమాలను రిప్లై చేసి కూడా చూడవచ్చు. ఐఫోన్ IOS, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఒకేసారి ఈ అప్లికేషన్ విడుదల కానున్నది. 


ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేల క్రీడా పోటీలకు ప్రేక్షకులు రావడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చి రసవత్తరంగా క్రీడా పోటీలను కొనసాగించేందుకు ఫేస్బుక్ సంస్థ యోచిస్తోంది. ప్రేక్షకులు చురుకుగా పాల్గొనేందుకు వెన్యూ యాప్ అనేకమైన ఫ్యూచర్ లను అందిస్తుంది. క్రీడా పోటీలకు ప్రత్యక్ష ప్రసారం లో కామెంట్లో చెప్పే వారితో ప్రేక్షకులు మాట్లాడుకోవచ్చు. ప్రశ్నలు అడగవచ్చు. ఈవెంట్లు జరుగుతున్నంత కాలం ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడుకునే సదుపాయాన్ని వెన్యూ యాప్ కలిగించనుంది.


డిజిటల్ మాధ్యమం ద్వారా అభిమానులు ఇతర అభిమానులతో కలిసి క్రీడా పోటీలను ఎంజాయ్ చేస్తూ వీక్షించవచ్చు. ఫేస్బుక్ సంస్థ మొట్టమొదటి సారిగా నాస్కార్ తో కలిసి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ యాప్ ను రూపొందిస్తోంది. నాస్కార్ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ టీమ్ క్లార్క్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా తోటి ఆడియన్స్ తో కలిసి స్పోర్ట్స్ కార్యక్రమాలను సరికొత్త మార్గం ద్వారా చూసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం', అని చెప్పుకొచ్చాడు. 


ఫేసుబుక్ సంస్థ అధికారులు మాట్లాడుతూ వెన్యూ యాప్ లో ఎక్కవ క్రీడా కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని... అనేకమైన క్రీడా కార్యక్రమాలతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటున్నామని... ఇప్పటికే ఫుట్బాల్ లీగ్ తో పార్టనర్ షిప్ పెట్టుకున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: