నేటి స‌మాజంలో అంతా స్మార్ట్‌ఫోన్ మయం అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచంలో ఎక్క‌డ‌.. ఏ మారుమూల‌.. ఏం జ‌రిగినా మ‌న అర చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే తెలిసిపోతోంది. దీంతో ఎక్కడ చూసినా స్మార్ట్‌‌ ఫోన్లే. అవసరాలకు ఫోన్ చాలా అవసరంగా మారింది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. అయితే ఫోన్ నుంచి పోస్టులు గాని రిప్లయిలు కాని కామెంట్లు కాని ఇచ్చే సమయంలో మనకు ప్రధానంగా వచ్చే సమస్య టైపింగ్. ఒక్కోసారి వేగంగా టైప్ చేయలేకపోతుంటాం. త్వ‌ర‌గా రిప్లయిలు ఇవ్వలేము. అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.. ఫాస్ట్‌గా టైపింగ్ చేయ‌వ‌చ్చు.

 

అందులో ముందుగా, ఒక పదాన్ని మీరు టైప్ చేయగానే దానికి రిలేటెడ్ గా మీకు మరో పదం కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు టైపింగ్ వేగవంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎదుటివారి మెసేజ్‌కు రిప్లై ఇచ్చే సమయంలో మీరు ఏమనుకుంటున్నారో దానిని ఎమోజి ద్వారా ఇస్తే సరిపోతుంది. ఎమోజీలు వాడటం ద్వారా మీరు మీ సమయాన్ని అలాగే టైపింగ్ శ్రమని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, మీరు టైపింగ్ చేసే టైమ్‌లో ఒక్కోసారి కొన్ని రకాల తప్పులు వ‌స్తుంటాయి.

 

దీనికి పుట్ స్టాప్ పెట్టేలా మీరు టైప్ చేయగానే దానికి సంబంధించిన అక్షరాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. వాటిని సెలక్ట్ చేసి మీరు మీ సమస్యను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే మీరు మీ కీ బోర్డ్ నుంచి వాయిస్ టైపింగ్ చేయడం ద్వారా కూడా మీరు వేగవంతంగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సంధర్బానికి తగ్గట్లుగా మీరు ఏదైనా మాట్లాడితే అది పదాల రూపంలో మీకు గూగుల్ అందిస్తుంది. ఇక జీ బోర్డ్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇతర కీ బోర్డులను ఉపయోగించి మీరు వేగవంతంగా టైప్ చేయవచ్చు.

 
 
 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: