టిక్‌టాక్.. ఈ యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ముఖ్యంగా ఇండియాలో టిక్ టాక్ యాప్‌కు భారీ క్రేజ్ సంపాధించుకుంది. ఈయాప్‌ డబ్‌ స్మాష్‌ మాదిరి ఉంటుంది. ఇందులో మ్యూజికల్ వీడియోస్ ఉంటాయి. ఆడియోలు, వీడియోలు కలుపుకొనే వెసులుబాటు ఉంటుంది. డబ్‌ స్మాష్‌ల తరహాలో సినిమా పాటలకు డ్యాన్సు లు, యాక్షన్, మాటలు, హావాభావాలు కలిపి వీడియోలు చేయవచ్చు. ప్ర‌స్తుతం ఈ యాప్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. చిన్నాపెద్దా అని లేకుండా అందరినీ బానిసలను చేసుకుంటోంది టిక్‌టాక్‌.

 

ఏదో సరదాగా ఉందని మొదలుపెట్టిన చాలా మంది టిక్‌ టాక్ కు బానిసవుతున్నారు. ఆఫీసులు, ఇళ్లు, రోడ్లు ఎక్కడైనా సరే.. ఏదో వీడియో తీసి అప్ లోడ్ చేయడం.. ఎన్ని వ్యూస్, లైకులు వస్తున్నాయా అని చూడటం పెరిగిపోయింది. అయితే ఒక్కోసారి టిక్‌టాక్ లో కొన్ని అకౌంటులు నిజంగా బాధించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ టిక్‌టాక్‌లో ఒక వ్యక్తి చేసే వీడియోలు మీకు ఇబ్బందిని కలిగించిన లేదా వారు చేసే కామెంట్స్ నచ్చకపోయినా లేదా ఒకరిని బ్లాక్ చేయాలనుకుంటున్నట్లు మీకు అనిపించిన సందర్భాలు చాలా ఉండవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ ఫాలో అయితే మీరు టిక్‌టాక్‌లో ఎవరినైనా బ్లాక్ చేయ‌వ‌చ్చు. అందుకు ముందుగా, టిక్‌టాక్‌ను ఓపెన్ చేయండి. 

 

ఆ త‌ర్వాత‌ డిస్కవర్ మీద క్లిక్ చేసి.. మీరు బ్లాక్ చేయదలిచిన వ్యక్తి యొక్క పేరును నమోదు చేయండి. దీనికి ప్రత్యామ్నాయంగా మీ యొక్క అకౌంట్‌పై ట్యాప్ చేయండి. ఫాలోయింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు బ్లాక్ చేయదలచిన యూజ‌రు పేరును వెతకండి. ఇప్పుడు యూజర్ యొక్క ప్రొఫైల్ ను ఓపెన్ చేయండి. త‌ర్వాత కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఇందులో బ్లాక్ అనే ఎంపికను ఎంచుకుంటే స‌రిపోతుంది. ఈ విధంగా మీరు కోరుకున్న యూజ‌ర్‌ను బ్లాక్ చేయగలరు. బ్లాక్ చేయబడిన తర్వాత వారు టిక్‌టాక్‌లో మీతో సంభాషించలేరు మరియు మీరు వారి వీడియోలను చూడలేరు.

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: