ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎంత ఖర్చు అయిన పర్వాలేదు స్మార్ట్ ఫోన్ ఉండాలి అందులో ఫీచర్స్ బాగుండాలి అని ఎదురుచూసే వాళ్ళకి ఒక శుభవార్త. ఇప్పుడు ఇన్ ఫీనిక్స్ నుంచి హాట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్  మార్కెట్ లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సేల్ ఈరోజు  మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో జరగనుంది. ఇన్ ఫీనిక్స్ హాట్ 9 స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన సేల్ జూన్ 8వ తేదీన జరగనుంది.

 

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 5% అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభించనుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు తో 10 శాతం తగ్గింపు లభించనుంది. నోకాస్ట్ ఈఎంఐ కూడా నెలకు రూ.792 నుంచి ప్రారంభం కానుంది. ఇక పోతే ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే స్క్రీన్ 6.6 అంగుళాల హెచ్ డీ+ హోల్ పంచ్ ఎల్సీడీ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 ఎక్సపాండబల్ మెమెరీ అందుబాటులో ఉంది. 

 


మనం అందరం ఎదురుచూసే  కెమెరాల విషయానికి వస్తే ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. ఇన్ ఫీనిక్స్ హాట్ 9 ప్రోలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, లో లైట్ సెన్సార్లను ఇందులో అందించారు. ముందువైపు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 5000 mah బ్యాటరీని అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ ఓటీజీ, వోవైఫై, మైక్రో యూఎస్ బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. అలాగే మనకు రెండు కలర్స్ లో అందుబాటులో ఉంది. ఓషియన్ వేవ్, వైలెట్ కలర్స్ అందుబాటులో కలవు..

మరింత సమాచారం తెలుసుకోండి: