గత మూడు నెలల నుండి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను ఏవిధంగా భయపడుతున్న అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని వలన మనుషుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో నూతన వరవాదులకు ఆవిష్కరణ దారి తీసేలా చేసింది. అప్పటి వరకు అసలు శానిటైజర్ ల విషయం కూడా తెలియని వాళ్ళు ఇప్పుడు వారికి అవి నిత్యవసర సరుకులు అయిపోయాయి. ఇంతకు ముందు కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు లేదా ఏదైనా హాస్పిటల్లో మాత్రమే పరిమితమైన మాస్కుల వాడకం ఇప్పుడు ప్రతి ఒక్కరు కచ్చితంగా వాడేటట్లు చేసింది. ఇకపోతే ఇప్పట్లో కరోనా వైరస్ బాధ తగ్గేలా లేకపోవడంతో కరోనా నుంచి రక్షించే ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో బాగా గిరాకీ పెరుగుతోంది. ఇక ఇదే ఆలోచనతో వ్యాపార రంగాలు అటువైపు దృష్టి సాధించాయి. ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సభలు, సమావేశాలు, కంపెనీల్లో, మీటింగు లలో భౌతిక దూరం అనివార్యమైన నేపథ్యంలో వెల్స్ ఫన్ గ్రూప్ సంస్థ ఒక ప్రత్యేకమైన కార్పెట్లను రూపొందించింది. అంతేకాదు వీటికి స్పెషియం - 6 అని పేరు కూడా పెట్టింది. అది ఏంటంటే కంపెనీలలో ఒకరి నుంచి మరొకరికి ఆరు అడుగుల దూరం ఉండేలా వివిధ రంగులలో కార్పెట్లను రూపొందించింది. తాజాగా ఆ కంపెనీ ఈ కార్పెట్ల కోసం ఆర్డర్ లు భారీగా వస్తున్నాయని కంపెనీ సీఈఓ ముఖేష్ తెలియజేశారు.

 

 

ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా ఉండడంతో కొత్త హాస్పిటల్ నిర్మాణం సాంప్రదాయంగా చాలా సమయం పడుతుంది. కాకపోతే దీనిని నివారించడానికి టాటా బ్లూ స్కోప్ స్టీల్ సంస్థ పేరుతో రేకులను ఉత్పత్తి చేస్తుంది. వీటిని చాలా సులువుగా ఎక్కడినుంచైనా ఎక్కడికైనా సరే సులభంగా తరలించవచ్చు. అంతేకాదు ఆ రేకులతో ఒక షెడ్ ను చాలా వేగంగా కేవలం గంటల సమయంలోనే పూర్తి చేసేయొచ్చు. 

 


ఇక మరో సైడ్ జెఎస్డబ్ల్యు పెయింట్స్ సంస్థ కూడా మరో కొత్త ప్రోడక్ట్ ని తీసుకు వచ్చింది. అందులో హాలోపెయింట్స్‌ పేరుతో సూక్ష్మజీవులను అడ్డుకొని పెయిన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకు ఈ పెయింట్ కు సంబంధించి అమ్మకాలు తూతూ మంత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు వీటి డిమాండ్ భారీగా పెరిగింది. దీనితో ఆ సంస్థ ఈ రంగుల ఉత్పత్తిని మరింతగా పెంచింది. ప్రస్తుతం ఇలాంటి పెయింట్స్ కు మార్కెటింగ్ చేయడంలో కంపెనీ దృష్టి సాధించింది. ఈ రంగులను అన్నిరకాల ఇండ్లకు మనము శుభ్రంగా వాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: