భారత ప్రభుత్వం డెవలప్ చేసిన ఆరోగ్య సేతు అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా మే నెలలో ఎక్కువసార్లు డౌన్లోడ్ కాబడిన పది అప్లికేషన్లలో ఒక స్థానాన్ని సంపాదించుకొని రికార్డు సృష్టించింది. శనివారం నాడు నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ఆరోగ్య సేతు అప్లికేషన్ యొక్క రికార్డులను వెల్లడించాడు. ఈ అప్లికేషన్ ను ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రం తప్పనిసరి చేసింది. కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులను ట్రేస్ చేసి వ్యాధి వ్యాప్తిని సంక్రమించకుండా నియంత్రణ చేసేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 


నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి... ' మనం డెవలప్ చేసిన ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా మే నెలలో ఎక్కువసార్లు డౌన్లోడ్ కాబడిన టాప్ 10 అప్లికేషన్లలో ఒక స్థానాన్ని సంపాదించింది. జూన్ నెలలో కూడా ఆరోగ్య సేతు ఎక్కువ డౌన్లోడ్స్ సంపాదిస్తూ టాప్ టెన్ అప్లికేషన్ గా దూసుకెళ్తోంది. భారతదేశం సాంకేతికతను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ కోవిడ్ 19 వ్యాధిపై పోరాడుతోంది', అని పేర్కొన్నాడు. 

IHG
ఏప్రిల్ 14వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ అప్లికేషన్ తమకు సమీపంలో ఉన్న ఎవరైనా తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి లకు కరోనా వైరస్ సోకితే అది ప్రజలను హెచ్చరిస్తుంది.


ఆరోగ్య సేతు అప్లికేషన్ ప్రధానమంత్రి ఆఫీస్ సెట్ అప్ చేసిన కమిటీ నేతృత్వంలో... నీతి ఆయోగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ సహాయంతో డెవలప్ చేయబడింది. ఏది ఏమైనా మోడీ పిలుపుతో చాలా కోట్ల మంది ప్రజలు ఆరోగ్య సేతు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: