కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ జాగ్రత్త నిమిత్తం భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను దాదాపుగా తీసివేసి... పూర్తిస్థాయిలో సడలింపులు ప్రకటించిన తర్వాత కూడా కరోనా వైరస్ సోకుతుందేమోనని ప్రజలు భయపడుతూ భౌతిక దూరాన్ని బాగా పాటిస్తున్నారు. కొన్నేళ్ల వరకు ప్రజలు భౌతిక దూరాన్ని తప్పకుండా పాటిస్తారు అని తెలుస్తోంది. అయితే అటువంటి పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని మార్చేందుకు ఐఫోన్ యాజమాన్యం సరికొత్త టెక్నాలజీని వినియోగదారులకు అందిస్తుంది. ఇందులోని భాగంగానే ఐఫోన్ తమ వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటిస్తూనే సెల్ఫీ లను తీసుకునే టెక్నాలజీని రూపొందించింది. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్ యాపిల్ సంస్థ కనిపెట్టిన సెల్ఫీ టెక్నాలజీ పేటెంట్ గ్రాంట్ చేసింది. అంటే ఈ టెక్నాలజీ కేవలం యాపిల్ ప్రొడక్ట్స్ లలో యాపిల్ యాజమాన్యం మాత్రమే ఉపయోగించ గలదు. సో, ఇక ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏవైనా యాపిల్ సంస్థ వారు రూపొందించిన టెక్నాలజీని కాపీ కొట్టేందుకు వీలు లేదు. 


టెక్నాలజీ యాపిల్ ఫోన్ లలో ఎలా ఉంటుందంటే... ప్రస్తుత మార్కెట్లోకి విడుదలవుతున్న ప్రతి ఫోన్లో వైడ్ యాంగిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా దూరంగా ఉన్న వాటిని కాప్చర్ చేయొచ్చు. కానీ ఈ వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా ఇద్దరు వ్యక్తులు సెల్ఫీలు దిగితే వారి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది. అది చూడటానికి అంతగా బాగోదు. దానికి ప్రత్యామ్నాయంగా ఐఫోన్ సంస్థ కుత్రిమ గ్రూప్ సెల్ఫీస్(synthetic group selfies) టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాలజీ ఇద్దరు లేదా అనేకమంది వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఫోటో దిగితే... వారి మధ్య ఖాళీ ప్రదేశం లేకుండా అందరి ఫోటోలని దగ్గరికి చేర్చి నిజంగానే దగ్గర దగ్గరగా నిలుచుని దిగినట్టు ఫైనల్ ఫోటోని ఎడిట్ చేస్తుంది. అయితే ఈ సెల్ఫీ ఫోటో ఎడిట్ చేసినట్టు మీకు తప్ప వేరే వారికి తెలియకుండా ఐఫోన్ సంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. 


లైవ్ వీడియోలలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఇతరులకు కనిపించవచ్చు. ఈ సెల్ఫీ ఫోటో లో వినియోగదారులు తమ ఫోటో పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ సెల్ఫీ టెక్నాలజీని ఉపయోగించి... దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా సెల్ఫీలు దిగవచ్చు. దీనికి చేయవలసిందల్లా మీరు ఎవరితో అయితే సెల్ఫీ కావాలనుకుంటున్నారో వారికి గ్రూప్ సెల్ఫీ రిక్వెస్ట్ పంపాలి. వారు ఆ గ్రూప్ సెల్ఫీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు సరైన పొజిషన్ లోకి వచ్చి సెల్ఫీ ఫోటో దిగవచ్చు. ఈ టెక్నాలజీ అన్ని ఐఫోన్ లలో త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా వీరి ఐడియా అద్భుతంగా ఉందని నెటిజన్లు తెగ కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: