ఫేస్ బుక్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. నేటి స‌మాజంలో ఫేస్ బుక్ ఓపెన్ చేయనిదే కొంద‌రికి నిద్ర కూడా పట్టడం లేదు. రోజంతా ఏవో పోస్టింగ్ లు అలాగే లైకులు, కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక పెరుగుతున్న గణాంకాలు, విస్తృతంగా వాడకంలోకి వస్తున్న మొబైల్ ఇంటర్నెట్ సేవల ద్వారా ఫేస్ బుక్ భారీగా పెరిగింద‌ని చెప్పొచ్చు. అయితే కొంద‌రు తెలిసో.. తెలియ‌కో ఫేస్‌బుక్‌లో కొన్ని త‌ప్పులు చేస్తుంటారు. అవే  ఒక్కోసారి పెద్ద పెద్ద వివాదాలు సృష్టిస్తాయి. 

 

అందుకే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌నులు మాత్రం ఫేస్‌బుక్‌లో అస్స‌లు చేయ‌కండి. ఇందులో ముందుగా.. మీ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో 500 మంది ఉన్నారు అంటే.. మీకు 500 మంది స్నేహితులు కాదు.  ఫేస్ బుక్ అనేది మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే వేదిక. కాబట్టి ఎవరో అపరిచిత వ్యక్తికి ఆ సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఇవ్వకండి. అలాగే మీ ఇంటి చిరునామా, మీ ఊరు, ఇతర వివరాల వంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో అస్సలు పోస్ట్ కానీ, షేర్ కానీ చేయకండి. ఎందుకంటే ఈ సమాచారం కోసమే ఎదురు చూసే వారికి ఇది ఎంతో విలువైనది. 

 

ఆ త‌ర్వాత మీరు చాలా ఇబ్బందులు కూడా ప‌డాల్సి వ‌స్తుంది. అదేవిధంగా, ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన భాషను ఎప్పుడూ యూజ్ చేయ‌కూడ‌దు. ఒక వ్యక్తిని ఉద్దేశించినప్పుడు మాత్రమే కాకుండా, సాధారణంగా మీరు పోస్ట్ చేసేటప్పుడు కూడా అభ్యంతరకరమైన భాషను ఎప్పుడూ ఉప‌యోగించ‌కూడ‌దు. దీని వ‌ల్ల మీరు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే మీ పిల్లలు తినడానికి ఇష్టపడేవి, వారి పాఠశాలకు సంబంధించిన సమాచారం, వారి స్కూల్ టైమింగ్స్ వంటి వాటిని అస్సలు పోస్ట్ చేయకండి. ఇలాంటి వాటి వ‌ల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: