సాంసంగ్ స్మార్ట్ వాచ్ లు వాడడానికి ఎంతోమంది బాగా ఇష్టపడుతుంటారు. ఇతర కంపెనీ మొబైల్ ఫోన్లను వాడే వారు కూడా సాంసంగ్ స్మార్ట్ వాచ్ లను కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే అటువంటి వారికోసం సాంసంగ్ తమ స్మార్ట్ వాచ్ ల ద్వారా అవసరం లేని సామ్సంగ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేయవలసిందిగా ఆంక్షలు పెడుతోంది. సాంసంగ్ సంస్థ అప్లికేషన్ లను డౌన్లోడ్ చేసుకుంటేనే సాంసంగ్ స్మార్ట్ వాచ్ లు పనిచేస్తాయన్న రూల్ ప్రస్తుతం వినియోగదారులకి ఆగ్రహం తెప్పిస్తుంది. అలాగే ఈ సాంసంగ్ పద్ధతి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. 


మాక్స్ వెయింబచ్ అనే పేరుగల ఓ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా సాంసంగ్ వాచ్ లో సాంసంగ్ పే వినియోగించాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి కాకుండా వేరొక సర్వర్ నుండి సాంసంగ్ వేరబుల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సి వస్తోంది. అన్నోన్(unknown) అప్లికేషన్ లకు అనుమతి ఇవ్వాల్సి వస్తుంది అనే విషయాన్ని అందరి దృష్టికి తీసుకు వచ్చాడు. 


వాస్తవానికి సాంసంగ్ వేరబుల్ యాప్ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది. ఒకవేళ ఈ అప్లికేషన్లో ఎటువంటి హానికరమైన వైరసులు ఉన్నా... గూగుల్ ప్లే స్టోర్ వెంటనే ఆ అప్లికేషన్ ని తమ ఫ్లాట్ ఫామ్ తొలగిస్తుంది. కానీ సాంసంగ్ వేరబుల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించినప్పటికీ... సామ్సంగ్ మాత్రం వేరొక సర్వర్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసేలా బలవంతం చేస్తుంది. ఇది గూగుల్ ప్లేస్టోర్ రూల్స్ లకు విరుద్ధమని గూగుల్ సంస్థ సాంసంగ్ పై మండిపడుతుంది. ఆండ్రాయిడ్ డివైసెస్ గూగుల్ ప్లే లో అవైలబుల్ అవుతున్న అప్లికేషన్లు మాత్రమే వాడాలనే మార్గదర్శకాలను సాంసంగ్ సంస్థ ఉల్లంఘించడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. సామ్సంగ్ సంస్థ ఈ సమస్యను ఫిక్స్ చేస్తుందని, లేకపోతే గూగుల్ సాంసంగ్ వేరబుల్ యాప్ ని తమ ఫ్లాట్ ఫామ్ నుండి డిలీట్ చేస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: