యురోపియన్ యూనియన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ చైనా, రష్యా దేశాల నుండి వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలను ఫేసుబుక్, గూగుల్, ట్విట్టర్ సంస్థలు ఎలా ఎదుర్కొంటున్నాయన్న దానిపై ప్రతి నెల ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఫ్యాక్ట్ చెక్ చేయవలసిందిగా తమ వినియోగదారులను కోరిన ట్విట్టర్ ని యూరోపియన్ యూనియన్ సీనియర్ అధికారిణి తెగ కొనియాడారు. కరోనా వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలను ఎలా అరికట్టాలనే ప్రయత్నంలో ఒక ప్లాన్ వివరించిన యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ వేరా జౌరోవా... ఆన్లైన్ టెక్ కంపెనీలు ఫేక్ న్యూస్ ని అరికట్టేందుకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నాయో... వాటిని ప్రతి నెల నివేదిక రూపంలో తెలియపరచాలని తెలిపారు. 


'కరోనా వైరస్ గురించి నెట్టింట ప్రత్యక్షమయ్యే తప్పుడు సమాచారం మన ప్రజాస్వామ్య దేశాలకు హాని కలిగించడంతో పాటు మన పౌరుల ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. ఫేక్ న్యూస్ మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావితం చూపుతుంది. ప్రభుత్వ అధికారులకు సమస్యలపై స్పందించే శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మనం తీసుకునే చర్యలను బలహీనపరుస్తుంది', అని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జౌరోవా చెప్పుకొచ్చారు. 


చైనా, రష్యా దేశాలకు చెందిన ప్రముఖ యాక్టర్లు తమ పాపులారిటీ ద్వారా యురోపియన్ దేశాల్లో, పక్క దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని, ఇప్పటికే టిక్ టాక్ సంస్థ కు కూడా ఫేక్ న్యూస్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించామని యురోపియన్ కమిషన్, యూనియన్ అధికారులు చెప్పారు. ఎవరైనా సెలబ్రెటీ ఏదైనా సమాచారం తమ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నప్పుడు... అది నిజమా కాదా అనే ఫ్యాక్ట్ చెకింగ్ విధానాన్ని అమలు పరచవలసినదిగా ఈయు అధికారులు ఆన్లైన్ టెక్నాలజీ కంపెనీలకు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: