ఏసర్ సంస్థ చాలా తక్కువ ధరకే ల్యాప్‌టాప్స్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. అన్ని కంపెనీల ల్యాప్‌టాప్స్ పర్ఫామెన్స్ లతో పోలిస్తే ఏసర్ కంపెనీ ల్యాప్‌టాప్స్ యొక్క పర్ఫామెన్స్ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తైవాన్ కంపెనీ భారతదేశంలో తన మార్కెట్ పెంచుకోవడానికి యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే తాజాగా భారతదేశ మార్కెట్లోకి హైయర్ ఎండ్ గేమింగ్ ల్యాప్‌టాప్ ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ల్యాప్‌టాప్ పేరు ఏసర్ నిట్రో 5 గేమింగ్ కాగా... దాని ప్రారంభ ధర 72, 990 రూపాయలు ఉంది. ఐతే ఈ ల్యాప్‌టాప్ ని కొనాలనుకున్నవారు acer E-store, ఈ కామర్స్ వెబ్ సైట్లు, రిటైల్ షాప్ లలో కొనుగోలు చేయవచ్చు. 

 

నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 హెచ్-సిరీస్ (10th Gen Intel Core i7 H-Series) మొబైల్ ప్రాసెసర్స్ తో, NVIDIA GeForce RTX 2060 GPU లతో, 144Hz డిస్ప్లే రేట్ తో లభించుచున్నది. మూడు మిల్లీ సెకండ్లలో స్పందించగల సమర్థవంతమైన టెక్నాలజీ ని నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్ లో ఇవ్వబడిందని ఏసర్ సంస్థ అధికారులు తెలిపారు. నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్ లో Full HD IPS ప్యానెల్ డిస్ప్లే లభిస్తుంది. 17.2-అంగుళాల ల్యాప్‌టాప్ లో అయినా, 15.6-అంగుళాల ల్యాప్‌టాప్ లో అయినా Full HD IPS ప్యానెల్ డిస్ప్లేనే ఇచ్చామని ఏసర్ సంస్థ తెలిపింది. ఈ రెండు వేరేషన్ల ల్యాప్‌టాపులలో 32GB ర్యామ్ లభిస్తుంది. గేమ్స్ ఆడుకునేందుకు ఇతర గ్యాడ్జెట్లు అమర్చుకోవడానికి HDMI 2.0, USB టైప్-సి 3.2 Gen 2, ఇంకా మరిన్ని పోర్టులు ల్యాప్‌టాప్ కి ఇవ్వబడ్డాయి. ఈ ల్యాప్‌టాప్ తో సహా కిల్లర్ ఈథర్నెట్(Killer Ethernet) కంట్రోలర్ లభిస్తుంది. గేమింగ్ సౌండ్స్ స్పష్టంగా వినపడేలా డిటిఎస్ సౌండ్ టెక్నాలజీ కూడా ఈ ల్యాప్‌టాప్ లో ఇవ్వబడుతుంది. 

 

గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాప్‌టాప్ సీపియు, జిపియు పై లోడ్ ఎక్కువయ్యి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఐతే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్ లో రెండు ఫ్యాన్ లు ఇవ్వడంతో పాటు కూల్ బూస్ట్ టెక్నాలజీ ని ఉపయోగించారు. కూల్ బూస్ట్ ఆప్షన్ ద్వారా మనం ల్యాప్‌టాప్ లోని ఫ్యాన్స్ స్పీడ్ ని పెంచి అధిక ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. ఏది ఏమైనా ల్యాప్‌టాప్ లలో గేమ్స్ ఆడాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: