చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ ఒప్పో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేయడనికి రెడీ అవుతుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త ఏ-సిరీస్ ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే ఒప్పో ఏ52. కంపెనీ తెలిపిన దాని ప్రకారం పంచ్ హోల్ డిస్ ప్లేతో ఒప్పో లాంచ్ చేస్తున్న మొదటి బడ్జెట్ ఫోన్ ఇదే. తాజాగా ఒప్పో ఏ52 స్మార్ట్ ఫోన్ కు సంబంధించి కచ్చితమైన లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.18,000 రేంజ్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ను అందుబాటు ధరలోనే లాంచ్ చేస్తామని ఒప్పో తెలిపింది.

 

 

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే.. ఒప్పో ఏ52 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందిస్తున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 2400x1080 పిక్సెల్స్ గా ఉంది. పంచ్ హోల్ డిస్ ప్లేను ఇందులో అందిస్తున్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుందని తెలిపారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 256 జీబీ వరకు పెంచుకోవచ్చునాని యాజమాన్యం తెలిపారు.

 

 

ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయన్నారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: