వన్ ప్లస్.. ఒకప్పుడు ఐఫోన్ అంటే గ్రేట్ అని అనేవారు.. కానీ ఇప్పుడు వన్ ప్లస్ ని గ్రేట్ అంటున్నారు. సూపర్ ఫోన్ అంటూ ఒకటే పొగిడేస్తున్నారు. అంత బాగుంటుంది ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్. అంతే కాదు ఎన్ని ఏళ్ళు అయినా కెమెరా తరగదు బ్యాటరీ ముదరదు.. ఎలా ఉన్న ఫోన్ అలానే ఉంటుంది. అందుకే ఈ ఫోన్ అంటే అందరికి తెగ నచ్చేస్తుంది. 

 

అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ నుండి కొత్త సరికొత్తగా వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అయితే ఇప్పటికే వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ సెల్ రెండు సార్లు జరగగా ఇప్పుడు వన్ ప్లస్ 8 ప్రో కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ సెల్ మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ సెల్ ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం నిర్వహించనున్నారు. 

 

వన్ ప్లస్ 8 ప్రో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.78 అంగుళాల క్యూహెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్. 

 

వన్ ప్లస్ 8 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరా,

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ + 5 మెగా పిక్సెల్ కలర్ ఫిల్టర్ సెన్సార్ లను అందించారు,

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,510 ఎంఏహెచ్ గా ఉంది. 

 

వన్ ప్లస్ 8 ప్రో ధరలు..

 

వన్ ప్లస్ 8 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా నిర్ణయించారు. 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: