జీ సూట్ వినియోగదారులు తమ ప్రాజెక్టు కు సంబంధించిన ఫైళ్లను లైవ్ లోనే చర్చించుకుంటూ సరైన సమాచారాన్ని ప్రాజెక్ట్ టీమ్ పార్ట్నర్స్ నుండి సేకరించవచ్చు. ప్రస్తుతం అందరూ ఇంటి వద్ద నుండి పనులు చేస్తున్నారు కాబట్టి గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ లను వేగవంతంగా ఉపయోగించేందుకు గూగుల్ సంస్థ అతి సులభమైన 5 టిప్స్ లను వెల్లడించింది. వినియోగదారులు తమ అభిప్రాయాలను డాక్యుమెంట్ లోనే వ్యక్తపరచడానికి గూగుల్ సంస్థ సరికొత్త టూల్ ని అందుబాటులోకి తెచ్చింది. ప్రాజెక్టులో ఏ విషయం గురించి చర్చించాలి అనుకుంటున్నారో... ఆ సెక్షన్ ని హైలెట్ చేసి రైట్ క్లిక్ చేసి, కామెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి వినియోగదారులు తమ అభిప్రాయాలను రాయవచ్చు. అలాగే ఏదైనా విషయం గురించి చర్చించడానికి మీకు అవసరమైన వారి ఇమెయిల్ ని @ తో ట్యాగ్ చేస్తే వారికి ఆటోమేటిక్ గా ఒక అలెర్టు నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. 

 


అలాగే వినియోగదారులు తమ ఫైల్ లో ఇతర టీమ్ మేట్స్ తో మార్పులు, సూచనలు చేయించుకోవచ్చు. ఐతే ఈ క్రమంలో ఫాంట్ టెక్స్ట్ స్టయిల్ మారడం జరగదు. అలాగే ఒరిజినల్ ఫైల్ లో ముందస్తుగా పొందుపరిచిన సమాచారం చూసుకునేందుకు అవకాశం కూడా గూగుల్ సంస్థ కల్పిస్తుంది. మీ టీమ్ మేట్స్ ఏ ఏ మార్పులు చేసారో తెలుసుకునేందుకు ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం వినియోగదారులు తమ ఫైల్ లో "last edit was on [ ]" అనే గ్రే కలర్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన అనంతరం ఏ తేదీన ఏ ఏ మార్పులు చేయబడ్డాయో మొత్తం ఒక లిస్టు రూపంలో కనిపిస్తుంది. వినియోగదారులు ఏ రోజున అయితే చిట్టచివరగా తమ ఫైల్ ని ఎడిట్ చేశారో ఆ వెర్షన్ ని చూసుకోవచ్చు. 

 


ఒకవేళ వినియోగదారులు షీట్స్ అప్లికేషన్ ఉపయోగిస్తుంటే... edit history అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇతర టీమ్ మేట్స్ జోక్యం వలన మార్పులు ఎలా చోటుచేసుకున్నాయో తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఆఫ్ లైన్ లో ఉన్నా డాక్యుమెంట్లు, షీట్స్, స్లయిడ్స్ లను క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, వీక్షించవచ్చు. ఇందుకోసం వినియోగదారులు గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ లోని సెట్టింగుల లోకి వెళ్లి "Available Offline" అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ ఎడిటింగ్ టూల్ సహాయంతో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్ లను ఎడిట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: