దోమలు కుట్టడం వల్ల వచ్చే మలేరియా సంక్రామ్యతను నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి హైడ్రోక్సిక్లోరోక్వినైన్ ఉపయోగించబడుతుంది. ప్రత్యేకంగా దీనిని క్లోరోక్విన్-సెన్సిటివ్ మలేరియా కోసం ఉపయోగిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్, పోర్ఫైరియా కుట్టెనా టార్టా చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు దీని వలన మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని నోటి ద్వారా తీసుకుంటారు. ఇది కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) కు ప్రయోగాత్మక చికిత్సగా కూడా ఉపయోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మందు వాడటం వలన సాధారణ దుష్ప్రభావాలలో వాంతులు, తలనొప్పి, దృష్టిలో మార్పులు, కండరాల బలహీనత  ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. 


ఇదిలా ఉండ‌గా కొవిడ్‌-19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సోమవారం తెలిపింది. కరోనా వైరస్‌పై చికిత్సలో ఈ మందులు సమర్థంగా వ్యవహరించే అవకాశం లేదని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వీటివల్ల కలిగే ప్రయోజనాల కన్నా ముప్పే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయం వల్ల.. ఫెడరల్‌ ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాలను రాష్ట్ర, స్థానిక అధికారులకు పంపిణీ చేయడం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు.


కరోనా అనుమానిత, పాజిటివ్‌ కేసులతో సన్నిహితంగా ఉండే వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా క్లోరోక్విన్‌ను వాడాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) గ‌తంలో సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే.  అయితే దీని వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని తెలిపింది. కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అయితే తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త్ ఏవిధంగా స్పందించ‌నుందో తెలియాలి. ఇప్ప‌టికే ప‌లు దేశాలకు ఇండియాకు ఈ మందుల‌ను ఎగుమ‌తి చేసిన విష‌యం విదిత‌మే..

మరింత సమాచారం తెలుసుకోండి: