ఇటీవ‌ల కాలంలో ఏ విష‌యం తెలియ‌క‌పోయినా.. ట‌క్కున గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. కంప్యూటర్‌లో అయినా, స్మార్ట్‌ ఫోన్‌లో అయినా గూగుల్ సెర్చ్‌‌ చేయటం ఇప్పుడు అందరికీ అలవాటయిన పని. ప్ర‌పంచంలో స‌మ‌స్త విష‌యాలు దీనిలో ఉండ‌డంతో అంద‌రూ గూగుల్‌నే ఎక్కువ‌గా న‌మ్మ‌కుంటుంటారు. ఇక గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందుబాటులోకి రావ‌డంతో.. ఏ విష‌యం తెలుసుకోవాల‌న్నా క్ష‌ణాల్లో ప‌ని అవుతోంది. అయితే ప్రతిసారీ కరెస్ట్ ఇన్‌ఫర్మేషన్ వస్తుందని నమ్మలేం. ఎందుకంటే గూగుల్ సొంతగా నిర్ధారణ చేసుకుని పెట్టే డేటా చాలా తక్కువ. మీరు చేసిన సెర్చ్ కు అనుగుణంగా వివిధ వెబ్ సైట్లలో ఉన్న అంశాలను మీ ముందుంచుతుంది అంతే.

 

అందుకే కొన్ని విష‌యాల్లో గూగుల్‌ను అస్స‌లు న‌మ్ముకోకూడ‌దు. సాధార‌ణంగా చాలా మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక వ్యాధి యొక్క లక్షణాలు మరియు వాటి యొక్క మందుల గురించి తెలుసుకోవడానికి గూగుల్ ను ఆశ్ర‌యిస్తారు.  కానీ, మీ వ్యాధి లక్షణాలను బట్టి మీరు ఏ మందులు వాడాలో చెప్పడానికి గూగుల్ కి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేదు కదా. అందుకే మీరు గూగుల్‌ను కాకుండా డాక్టర్ ను ఆశ్రయించడం మంచిది. అలాగే మొబైల్ ఫోన్ యాప్స్ కోసం గూగుల్ సెర్చ్‌లో వెతకడం మంచిది కాదు. దీని వ‌ల్ల ఫేక్ యాప్‌లు ఫోన్‌లోకి వచ్చి డేటా మొత్తం చోరీ చేసే చాన్స్ ఉంది. 

 

అందుకే గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ లాంటి వాటిలోనే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్త‌మం. అదేవిధంగా, వివిధ షాపింగ్ వెబ్ సైట్లో ఆఫర్ల కోసం కూపన్ కోడ్స్ ను గూగుల్ లో సెర్చ్ చేస్తే.. రిస్క్ ప‌డిపోతారు. ఎందుకంటే నకిలీ కూపన్లను అమ్మే నకిలీ వెబ్ సైట్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఇక‌ గూగుల్‌లో పోర్న్ కోసం సెర్చ్ చేస్తే మీ గ్యాడ్జెట్ మాల్ వేర్ బారినపడొచ్చు. ఎందుకంటే.. మాల్‌వేర్‌కు పోర్న్ సైట్లు హైవే లాంటవి. అలాగే బ్యాంకింగ్ వెబ్ సైట్ల లాగానే మున్సిపల్ ట్యాక్స్, ప్రభుత్వాస్పత్రుల వంటి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకర్లకు ప్రధాన లక్ష్యాలు. గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా లభ్యమయ్యే వెబ్ సైట్లలో ఏది అసలైనదో, ఏది నకిలీదో పట్టుకోవడం చాలా కష్టం. సో.. ఈ విష‌యంలోనూ కేర్‌ఫుల్‌గా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: