నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్నారు. అస‌లు చాలా మంది ఫోన్ లేనిదే బ‌య‌ట కాలు కూడా పెట్ట‌డం లేదు. అంటే ఫోన్‌ లేనిదే క్షణం గడవని విధంగా పరిస్థితి మారింది. ఏ ప‌ని చేయాల‌న్నా ఎవ‌రితో మాట్లాడాల‌న్నా ఫోన్ త‌ప్ప‌నిసరి. ఇలా  పనులన్నీ అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ లోనే కానిచ్చేస్తున్నాం. ఈ క్ర‌మంలోనే వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఉంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కొత్త ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? అది కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లోనే ఉండాల‌నుకుంటున్నారా..? అయితే రూ.10 వేలలోపే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అదిరిపోయే ఫోన్లు ఏం ఉన్నాయి? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

రెడ్ మీ నోట్ 7ఎస్: ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్,  48 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే ర్యామ్ + స్టోరేజ్: 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మ‌రియు 4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇక దీని ధ‌ర ‌రూ.8,999.

 

రియల్ మీ 5ఐ: ఇందులో 6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్,  12 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే ర్యామ్ + స్టోరేజ్: 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మ‌రియు 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక దీని ధ‌ర ‌రూ.9,999.

 

శాంసంగ్ గెలాక్సీ ఎం30: ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7904 ప్రాసెసర్,   13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే ర్యామ్ + స్టోరేజ్: 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మ‌రియు 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక దీని ధ‌ర రూ.9,685.

 

లెనోవో కే10 నోట్: ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్  710 ప్రాసెసర్,  16 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే  ర్యామ్ + స్టోరేజ్: 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మ‌రియు  4050 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక దీని ధ‌ర రూ.9,999


 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: