ఇటీవ‌ల కాలంలో అంతా ఆన్ లైన్ మయం అయిపోయింది. ఏది కావాల‌న్నా ఇంట్లో కూర్చోనే కొనుగోలు చేసుకుంటున్నారు. చిన్న పిన్ను నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే చాలా మంది ఆన్ ‌లైన్‌లోనే స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారు ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సి ఉంది.  మీరు ఒక ఫోన్ కొంటున్నారంటే.. ఆ ఫోన్ మీకు అన్ని విధాలుగా యూజ్ అవ్వాలి. బ్యాటరీ కోసం ఒక ఫోన్, మంచి పనితీరు కోసం ఒక ఫోన్, కెమెరా కోసం ఒక ఫోన్ కొనరు కదా. కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు అన్ని ఫీచ‌ర్ల‌ను చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి.

 

అలాగే ఆన్ లైన్‌లో ఫోన్లు కొనుగోలు చేసేట‌ప్పుడు ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఉండే రివ్యూలను పూర్తిగా నమ్మడం అంత మంచిది కాదు. ఎందుకంటే రివ్యూలు రాసే వారికి కూడా కొన్ని బ్రాండ్లు డబ్బులిచ్చి వారికి అనుకూలంగా రివ్యూలు రాయించుకుంటాయి. వాటిని న‌మ్మి మీరు గుడ్డిగా ఫోన్‌ను కొనుగోలు చేశారంటే మోస‌పోయిన‌ట్టే అవుతుంది. ఇక కెమెరా పనితీరు కోసం స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు ఎక్కువగా ఆధారపడేది వెబ్ సైట్ల‌ పైనే. ఇందులో అందించే స్కోర్ ని బట్టే ఏ ఫోన్ కెమెరా బాగుంది అని చాలా మంది డిసైడ్ అవుతారు. 

 

కానీ, వాటినే మాత్ర‌మే ఫాలో అవ్వ‌డం చాలా త‌ప్పు. అలాగే స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ల మార్కెటింగ్ ఈ మధ్య సోష‌ల్ మీడియా వేదికగా మారింది.  ఇటువంటి సెలబ్రిటీలకు ఆయా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు భారీగా నగదు చెల్లిస్తాయి. కాబట్టి మీరు సెలబ్రిటీ పోస్టులను నమ్మి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయకండి.  వెబ్ సైట్లలో సెలబ్రిటీలు పెట్టే ఇటువంటి పోస్టుల్లో చాలావరకు డబ్బులు తీసుకుని పెట్టేవే ఉంటాయి. ఇక కొత్త ఫోన్ పనితీరు ఎప్పుడూ సూప‌ర్‌గా ఉంటుంది. అయితే మీరు ఆ ఫోన్ ను యూజ్ చేసే కొద్దీ దానికి సంబంధించిన రేటింగ్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి బెంచ్ మార్క్ రిజల్ట్స్ అందించే వెబ్ సైట్లను నమ్మి ఫోన్ కొనుగోలు చేయ‌డం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: