Kiటాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో హీరోలు భార్యలకు ఎక్కువగా పెత్తనం ఇస్తూ ఉండటం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు భార్యల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. టాలీవుడ్ లో ఉన్న పరిస్థితులే దీనికి కారణం. స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేయడంతో ఇక భార్యల మీద భారం వేస్తున్నారు. వారి సహాయ సహకారాలతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నాడు. అతను రెండేళ్ళు ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలీవుడ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి సినిమాలను అతను చేస్తున్నాడు. ఆ సినిమాలు అయిన తర్వాత అతను మళ్ళీ కన్నడంలో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది. దీనితో అతను ఇప్పుడు తన సినిమా వ్యవహారాలూ ఆర్ధిక వ్యవహారాలూ అన్నీ కూడా భార్య చేతిలో పెట్టాలి అని చూస్తున్నాడు. తాను బిజీ గా ఉండటంతో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అని, కాబట్టి తనకు కాస్త సమయం కేటాయించాలి అని ఆమెను అడిగాడు అని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పారు అని టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్న తారక్సినిమా తర్వాత బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తాడు. ఈ లోపు అన్నీ కుదిరితే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ లో అతను కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది విడుదల కావడం కష్టమే అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: