ఇటీవ‌ల కాలంలో రియ‌ల్‌మీ స్మార్ట్‌ఫోన్లుకు క్రేజ్ బాగా పెరిగిపోయింద‌ని చెప్పాలి. అద్భుత‌మైన ఫీచ‌ర్లు, అతి త‌క్కువ ధ‌ర్ల‌కే ఫోన్లు అందుబాటులో రావ‌డంతో.. ఎక్కువ శాతం మంది రియ‌ల్‌మీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాజాగా రియ‌ల్‌మీ ప్రియుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ అందించింది. రియల్ మీ సీ3ఐ పేరుతో స్మార్ట్ ఫోన్ వియత్నాంలో రిలీజ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ తో ఈ ఫోన్ విడుద‌ల అయింది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఒక‌టి  2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ కాగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక‌టి.

 

రియల్ మీ సీ3ఐ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఈ  స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల హెచ్ డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను అందించారు. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీని అందించారు. వైఫై, బ్లూటూత్ v5.0, జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

 

రియల్ మీ సీ3ఐ కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, మరో 2 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ బరువు 195 గ్రాములుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 25,90,000 వియత్నాం డాంగ్ లుగా అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో సుమారు రూ.8,500గా నిర్ణయించారు. ఇది 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. అయితే దీని ధరను ఇంకా రియల్ మీ వెల్లడించలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: