టిక్‌టాక్.. ఈ యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను ముఖ్యంగా భార‌తీయులే ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్ యాప్ బాగా ఫేమస్ అయింది. చైనాకు చెందిన కంపెనీ బైట్‌ డాన్స్... 2016లో టిక్‌టాక్‌ను ప్రారంభించారు. అయితే ఈ యాప్ ప్రపంచ దేశాల్లో కంటే భార‌త్‌లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అందరూ గడుపుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ అట‌.

IHG

కానీ, ఈ టిక్‌టాక్ యాప్ వ‌ల్ల కొంత మంచి జ‌రిగితే.. కొంత చెడు కూడా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. గల్వాన్ ఘటన తర్వాత దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఇందులో భాగంగా చైనాకు చెందిన పాప్యులర్ యాప్ టిక్‌టాక్ ను కూడా అనిచేయాల‌ని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్ యాప్‌ను దెబ్బ కొట్టేందుకు కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ రాబోతోంది. 

IHG'Shorts' - Stress Buster

షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ మాదిరిగానే ఓ  సరికొత్త యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ వెల్ల‌డించింది. తర్వాత దీన్ని భారీ ఎత్తున లాంచ్ చేయనున్నామని గూగుల్ తెలిపింది. టిక్‌టాక్‌లాగానే ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేసేందుకు వీలుగా యాప్ విడుదల చేయనుంది. ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేసే వీలుంది. ఒకవేళ ఈ యాప్ లాంచ్ అయితే ఖ‌చ్చితంగా చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌కు గ‌ట్టి దెబ్బ ప‌డ‌నుంద‌ని చాలా మంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: