డ్రాగన్ కంట్రీ యాప్ టిక్ టాక్ ఇండియాలో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైమ్ లోనే చిన్నపాటి వీడియోలో చాలామంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే వారికీ ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడింది. సొంత టాలెంట్ బయట ప్రపంచానికి చూపించాలి అని అనుకునేవారికి టిక్ టాక్ పెద్ద ప్లాట్ ఫామ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యాప్ వల్ల చాలామంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవటం జరిగింది. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు ఈ యాప్ వల్ల కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు.

 

కాగా రీసెంట్ గా ఇటీవల భారత్ చైనా సరిహద్దు ప్రాంతం లడక్ వద్ద గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత ఇండియా లో డ్రాగన్ కంట్రీ పై ఒక్కసారిగా వ్యతిరేకత సెంటిమెంట్ రాజుకుంది. ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంలో 20 మంది ఇండియన్ సోల్జర్స్ ని డ్రాగన్ కంట్రీ ఆర్మీ చంపేయడంతో ప్రతి ఒక్క భారతీయుడు చైనాపై కోపంతో రగిలిపోవడం జరిగింది. పరిస్థితి భయంకరంగా యుద్ధ రీతిలో రెండు దేశాల మధ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో చైనా యాప్స్ వల్ల మన దేశానికి చెందిన సమాచారం శత్రు దేశానికి వెళ్లే అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం భావించి చైనా దేశానికి చెందిన టిక్ టాక్ తో సహా 59 యాప్ లను నిషేధించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టిక్ టాక్ యాప్ అలరించిన తరహాలో మరో యాప్ సరికొత్తగా రాబోతున్నట్లు సమాచారం. టిక్ టాక్ తరహాలో 'యూట్యూబ్ షాట్స్' అనే కొత్త యాప్ గూగుల్ తీసుకు రాబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. అతి త్వరలోనే భారీఎత్తున ఈ యాప్ లాంచ్ చేయబోతున్నట్లు గూగుల్ అధికారులు తెలిపారు. టిక్ టాక్ కి ఉన్నా ఫ్యూచర్లు ఈ యూట్యూబ్ యాప్ కి ఉండబోతున్నాట్లు సమాచారం. 15 సెకన్ల వీడియో పోస్ట్  చేసేలా ఈ యూట్యూబ్ షార్ట్స్ యాప్ ఉండబోతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: