గూగుల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఈ ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. అందరూ ట‌క్కున‌ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. కంప్యూటర్‌లో అయినా, స్మార్ట్‌ ఫోన్‌లో అయినా గూగుల్ సెర్చ్‌ చేయటం ఇప్పుడు అందరికీ అలవాటయిన పని. అన్ని రంగాలు, అన్ని వయస్సుల వారికి సంబంధించిన ఎటువంటి సమాచారమైన గూగుల్​లో సులభంగా దొరుకుతుంది. అందుకే స్పీడ్‌ సెర్చింగ్‌కు దీన్ని మించిందేదీ లేదంటారు. 

 

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. డెస్క్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ ఇలా ఏ గ్యాడ్జెట్‌లోనైనా ప్రధానంగా ఉపయోగించే అప్లికేషన్ వెబ్‌ బ్రౌజర్. ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. అయితే  ఇంటర్‌‌నెట్ బ్రౌజింగ్ కోసం వాడే గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలని ఇంటర్నెట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఈఆర్‌టీ-ఇన్) ఇంటర్నెట్ యూజ‌ర్ల‌ను హెచ్చ‌రిస్తుంది. సెన్సిటివ్ యూజర్ డేటాను కలెక్ట్ చేసే టైమ్‌లో 100 మెలీషియస్ ఎక్స్‌టెన్షన్స్‌ను తాము గుర్తించినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా తెలిపింది. 

 

గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ సెక్యూరిటీని స్కాన్‌ చేయడానికి ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో కోడ్ ఉన్నట్లు కనుగొన్నట్లు కూడా సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది. ఈ ఎక్స్‌టెన్షన్స్‌ గురించి వివరిస్తూ..ఇవి స్క్రీన్‌షాట్‌లను తీయడం, క్లిప్‌బోర్డ్ చదవడం, పాస్‌వార్డులు తెలుసుకోవడం, రహస్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని  కూడూ తెలిసింది. కాబ‌ట్టి,  యూజ‌ర్లు ఖ‌చ్చితంగా అవసరమైన ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి అని, అలా చేయడానికి ముందు వినిమోగదారుల రివ్యూలను తెలుసుకోవాలని పేర్కొంది. ఇక ఇప్ప‌టికే సైబర్‌ క్రైమ్‌ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ అన్ని కమర్షియల్‌  ఎక్స్‌టెన్షన్స్‌ను నిలిపివేసింది. కాగా, మినిస్ట్రీ ఆప్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ పరిధి కిందకు వచ్చే సీఈఆర్‌‌టీ.. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌ను డీల్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: