ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి స‌మ‌యంలో.. గాల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీ మధ్య గొడవ‌లు జ‌ర‌గ‌డంతో భారీ ఎత్తున ప్రాణనష్టం జ‌రిగింది. ఇర‌వై మంది భారతీయులు చనిపోగా, చైనాకి చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. ఈ నేపథ్యంలో భార‌త్‌లో చైనాపై వ్య‌తిరేక‌త తారా స్థాయికి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే బాయ్‌కాట్ చైనా’ నినాదం బలంగా వినిపిస్తోంది. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది నిర్ణయించారు. చైనా బ్రాండ్ల ఫోన్లు కాకుండా మ‌న‌దేశంలోనూ ఎన్నో అద్భుత స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుని.. మీకు న‌చ్చింది ఎంచుకోండి.

 

 శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్: 6.7 అంగుళాల డిస్ ప్లే డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్‌, 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, శాంసంగ్ ఎక్సినోస్ 9810 ప్రాసెస‌ర్ ఇందులో ఉన్నాయి. అలాగే 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఇక దీని ధ‌ర రూ.37,999 నుంచి ప్రారంభం కానుంది.

 

ఐఫోన్ 11: 6.1 అంగుళాల డిస్ ప్లే డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్‌, 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెస‌ర్ ఇందులో ఉన్నాయి. అలాగే 3110  ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఇక దీని ధ‌ర రూ.68,300 నుంచి ప్రారంభం కానుంది.

 

ఎల్జీ జీ8ఎక్స్ థింక్: 6.4 అంగుళాల డిస్ ప్లే డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్‌, 12 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెస‌ర్ ఇందులో ఉన్నాయి. అలాగే 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఇక దీని ధ‌ర రూ.54,999 నుంచి ప్రారంభం కానుంది. 

 

నోకియా 8.1:  6.18 అంగుళాల డిస్ ప్లే డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్‌, 12 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ కెమెరా, 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెస‌ర్ ఇందులో ఉన్నాయి. అలాగే 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఇక దీని ధ‌ర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: