ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో సరికొత్త యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. 'జియో మీట్​' పేరుతో విడుదలైన వీడియో కాలింగ్​ అప్లికేషన్​తో ఏకకాలంలో 100 మంది మీటింగ్​లో పాల్గొనవచ్చు. చైనా యాప్​లపై వ్యతిరేకత వల్ల స్వదేశీ యాప్​లకు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో గురువారం దీనిని విడుదల చేసింది.వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ల వినియోగం ఇటీవల బాగా పెరిగిన నేపథ్యంలో రిలయన్స్‌ జియో కూడా ఈ తరహా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'జియో మీట్‌' పేరుతో వీడియో కాలింగ్​ యాప్​ను గురువారం అధికారంగా లాంచ్​ చేసింది. ఇది జూమ్​, మైక్రోసాఫ్ట్​ టీమ్స్​, గూగుల్​ మీట్​కు ప్రత్యామ్నాయంగా మారనుంది. గూగుల్​ ప్లేస్టోర్​, యాపిల్​ స్టోర్​లో ఇది ఉచితంగా అందుబాటులో ఉంది.

 

 

జియో మీట్​తో ఏకకాలంలో 100 మంది మీటింగ్​లో పాల్గొనవచ్చు. ఈమెయిల్​ ఐడీ, ఫోన్​ నంబర్​తో లాగిన్​ కావాల్సి ఉంటుంది. హెచ్​డీ క్వాలిటీతో వీడియో కాలింగ్​ చేసుకోవచ్చు. మీటింగ్​లకు పాస్​వర్డ్​తో భద్రత, జూమ్​ తరహాలోనే వెయిటింగ్​ రూమ్​ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్​ఫాక్స్ ద్వారా కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. మల్టీ డివైజ్​ లాగిన్​నూ ఈ యాప్​ సపోర్ట్​ చేయనుంది. ఐదు డివైజ్​లలో లాగిన్​ అయి వాడుకోవచ్చు. స్క్రీన్​ షేరింగ్​, సేఫ్​ డ్రైవిండ్​ మోడ్​ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 


ఎటువంటి డివైస్​‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పైనైనా ఈ యాప్​ పనిచేస్తుంది. సహకార కార్యకలాపాల (కొలాబ్రేషన్‌) అవసరాలకు దీన్ని వినియోగించవచ్చు. జియోకు చెందిన ఇ-హెల్త్‌ ప్లాట్‌ఫాంను మీట్‌ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో వైద్యులతో సంప్రదింపులకు, ఔషధాల సిఫారసు చీటీని (ప్రిస్కిప్షన్‌) పొందేందుకు, మందులు ఆర్డరు చేసేందుకు, వైద్య పరీక్షలకు ఈ మీట్‌ యాప్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.అలాగే ఇ-హెడ్యుకేషన్‌ ఫ్లాట్‌పాం అనుసంధానంతో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణ, హోంవర్క్‌లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం, సొంతంగా విద్యార్థులు మల్టీమీడియాను నేర్చుకునే వెసులుబాటును కల్పించడం లాంటి సేవలకు కూడా జియో మీట్‌ ఉపయోగపడనుంది.కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు, సమావేశాల నిర్వహణకు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌లకు ఇటీవల డిమాండ్​ పెరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: