ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా.. ఇప్ప‌టికే ఎన్నో అద్భుత ఫోన్ల‌ను అందించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో అద్భుత స్మార్ట్‌ఫోన్‌ను అందించింది మోటొరోలా. అదే మోటొరోలా వన్ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్.  ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఎమరాల్డ్ గ్రీన్, ఓషన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

 

స్పెసిఫికేష‌న్స్ చూస్తే.. మోటొరోలా వన్ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 4 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. కెమెరా విష‌యానికి వ‌స్తే.. మోటొరోలా వన్ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ వెన‌క‌వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో  ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

 

అలాగే 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. మ‌రియు  5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కూడా అమ‌ర్చారు. ఇందులో బ్లూటూత్ వీ5.0, వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త మోటొరోలా ఫోన్ లాటిన్ అమెరికా దేశాల్లో అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో కూడా త్వరలో లాంచ్ చేస్తామని మోటొరోలా వెల్ల‌డించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర చిలీలో 1,99,990 పెసోలు అంటే.. ఇండియ‌న్ క‌రెన్సీలో సుమారు రూ.18,650గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: