టిక్‌టాక్‌.. ఈ యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైనాకు చెందిన ఈ యాప్ అతిత‌క్కువ కాలంలో ఎక్కువ‌మందిని ఆక‌ట్టుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వంద‌ల కోట్ల మంది ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నారు. కానీ, మిగిలిన దేశాల్లో క‌న్నా.. భార‌త్‌లోనే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఈ యాప్‌ ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ చేయడం వంటివి దీనిలో చాలా సులభంగా చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్ వల్ల ఎంతో మందికి తమ ప్రతిభను ప్రదర్శించుకోడానికి అవకాశం లభించింది. 

 

అయితే నిబంధనలు అతిక్రమించి.. దురాక్రమణ దాహంతో కొట్టిమిట్టాడుతున్నా చైనాకు బుద్ధి చెప్పేందుకు భార‌త్ ప్ర‌భుత్వం ప‌లు యాప్ల‌తో పాటు టిక్‌టాక్‌ను సైతం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేశాక  చాలా మంది టిక్‌టాక్‌ యూసర్లు, టిక్‌టాక్‌ ఫేమస్ స్టార్లు  తమ ఫలోవర్స్ ని పోగొట్టుకొకుండా ఉండడానికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే  పలు సంస్థలు టిక్‌టాక్ మాదిరిగానే మరికొన్నియాప్స్ ను విపణిలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి.

 

ఇక ప్ర‌స్తుతం ఎంటర్టైన్మెంట్ కు అలవాటుపడిన జనం టిక్‌టాక్‌ నిషేధించడం తో  `రోపోసో` అనే మొబైల్ ఆప్ ను తెగ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ప్లే స్టోర్ లో అత్యధిక డౌన్ లోడ్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే `చింగారి` లాంటి మొబైల్ ఆప్స్ కూడా దూసుకుపోతున్నాయి. టిక్‌టాక్‌కు మీస్ అవుతున్న‌వారు ఈ యాప్స్‌ను ఎంచుకోవ‌చ్చ‌ని ప‌లువురు సూచిస్తున్నారు. ఇక మ‌రోవైపు.. టిక్ టాక్ స్థానంలో కనీసం ప‌ది దేశీయ మొబైల్ యాప్ లు తెచ్చేందుకు పలు సంస్థ‌లు రెడీ అయ్యాయి. అలాగే ఇప్పటికే ఉన్న ఆప్ లు మరింత మెరుగ్గా తమ సేవలు అందిస్తాయని అంటున్నారు.

 
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: