తాజాగా చైనీస్ మొబైల్ సంస్థ అయిన రియల్ మీ భారతదేశంలోని మీడియా ప్రతినిధులందరిని ఆహ్వానించి... తమ సంస్థ నుంచి రియల్ మీ C11 మోడల్ పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ మంగళవారం అనగా జులై 14వ తారీకున మధ్యాహ్నం 1:00 కి విడుదలవుతుందని తాజాగా వెల్లడించింది. రియల్ మీ మొబైల్ ఫోన్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించగా... ప్రస్తుతానికి 35 మిలియన్ల ప్రజలు రియల్ మీ ఫోన్లని వినియోగిస్తున్నారు. రియల్ మీ C11 మలేషియా దేశంలో గత నెలలోనే విడుదల అయింది. రియల్ మీ సంస్థ చెప్పిన ప్రకారం భారతదేశంలో 75 లక్షలమంది రియల్ మీ సి-సిరీస్ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారట. ఈ విషయాలన్నీ రియల్ మీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

2GB+32GB స్టోరేజ్ కలిగి ఉన్న రియల్ మీ C11 మలేషియా దేశం లో MYR 449 ధరకు విక్రయించబడుతున్నాయి. అయితే మలేషియా దేశంలో ఈ ఫోన్ యొక్క ధర ని బట్టి మన దేశంలో రియల్ మీ C11 ధర సుమారు 7500 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో రియల్ మీ C3 స్మార్ట్ ఫోన్లు కేవలం ₹6, 999 కే భారతదేశ మొబైల్ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ వ్యాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్ ని చాలామంది కొనుగోలు చేయగా... దానికి అప్గ్రేడ్ వెర్షన్ గా C11 ని భారతదేశం మొబైల్ ప్రియుల కోసం ఐదు రోజుల్లో లాంచ్ చేయబోతుంది రియల్ మీ సంస్థ.
స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను గురించి సమగ్రంగా తెలుసుకుంటే... ఈ మొబైల్ ఫోన్ లో 5000mAh బ్యాటరీ, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న 6.5 అంగుళాల (HD+LCD) హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి35 చిప్‌సెట్‌తో పాటు 2 జిబి ర్యామ్ 32 జిబి స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ వంటి హార్డువేర్ ఫ్యూచర్స్ లభించనున్నాయి. C11 ఫోన్ యొక్క కెమెరా విషయాలకొస్తే, వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను ఎఫ్ / 2.2 లెన్స్‌తో, పోర్ట్రెయిట్ ఫోటోల కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అమర్చడం జరిగింది.  ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్ ఎఫ్ / 2.4 సెన్సార్‌తో ఉంటుంది.  ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌ మీ యుఐ తో వస్తుంది. అలాగే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 పై నడుస్తుంది.




Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: