ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లే. స్మార్ట్ ఫోన్  లేకపోతే రోజు గడవదు అనే మంది చాలా మంది ఉన్నారు. ఇటీవల చైనా కు సంబంధించిన కొన్ని యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి అందరికి విదితమే. ఇక సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ అంటే చైనా కంపెనీలే గుర్తొస్తాయి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో వాటి వైపు అంతగా మొగ్గు చూపట్లేదు. దీనితో ఇండియన్ కంపెనీలు కూడా వాటి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇక తాజాగా భారత దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ సంస్థ నుంచి సరి కొత్త మొబైల్ రిలీజ్ చేసింది. 

IHG


లావా సంస్థకు చెందిన పాపులర్ జడ్ సిరీస్ లో లావా జెడ్ 61 ప్రో మోడల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక వాస్తవానికి రెండేళ్ల క్రితమే లావా జెడ్ 61 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం జెడ్ 61 ప్రో మోడల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ మేడిన్ ఇండియా స్మార్ట్ ఫోన్. అతి ముఖ్యమైన విషయానికి వస్తే ధర కేవలం రూ. 5774 మాత్రమే. ఇక అంతే కాకుండా ఇటీవల చైనా ఫోన్లు ఉత్పత్తులు  చేసే సంస్థలు కూడా బ్యాన్ చేయాలని నినాదాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కొందరు భారతదేశంలో స్మార్ట్ ఫోన్ తయారు చేసిన కంపెనీ వివరాల గురించి కూడా సెర్చ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లావా ఇంటర్నేషనల్ సంస్థ పక్కాగా భారతదేశానికి చెందిన సంస్థ. అంతేకాకుండా ఇప్పటికే పలు మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. 

IHG'Made in India' smartphone launched: price ...


ఇక లావా జెడ్ సిక్స్ ప్రో మోడల్  స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో డిస్‌ప్లే 5.45 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ వ్యూ డిస్‌ప్లే ఉండగా, ర్యామ్ 2జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్ 16 జీబీ, ప్రాసెసర్ ఆక్టాకోర్, రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, బ్యాటరీ 3100 ఎంఏహెచ్ లభించనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: