మోటోరోలా.. ఫోన్ చూడటానికి మోటోలా ఉన్న క్యూట్ గా ఉంటుంది అని అంటుంటారు మోటోరోలా ప్రియులు. ఇంకా ఈ మోటోరోలా నుండి ఇప్పుడు ఓ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అదే మోటొరోలా వన్ విజన్ ప్లస్ స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి పోయిన ఏడాది లాంచ్ అయిన మోటో జీ8 ప్లస్ స్మార్ట్ ఫోన్ తరహాలో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది తెలియలేదు.. 

 

IHG

 

స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు ఇవే!

 

6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే,

 

4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు, 

 

వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 16 మెగా పిక్సెల్ సెన్సార్ + అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు అందించారు. 

 

25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాకు అందించారు. 

 

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 

 

IHG

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర 14,320 రూపాయలుగా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ పింక్, కాస్మిక్ బ్లూ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మన దేశంలో లాంచ్ అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: