స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఎన్నో బ్రాండ్ల మ‌ధ్య పోటీ న‌డుస్తోంది. అయితే వాటిలో ఇటీవ‌ల రియ‌ల్‌మీ స్మార్ట్‌ఫోన్లుకు క్రేజ్ బాగా పెరిగిపోయింద‌ని చెప్పాలి. అద్భుత‌మైన ఫీచ‌ర్లు, అతి త‌క్కువ ధ‌ర్ల‌కే ఫోన్లు అందుబాటులో రావ‌డంతో.. ఎక్కువ శాతం మంది రియ‌ల్‌మీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాజాగా రియ‌ల్‌మీ ప్రియుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. జులై 14వ తేదీన రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇక అదే రోజు రియల్ మీ 6ఐ స్మార్ట్ ఫోన్ కూడా విడుద‌ల కానుంది.

 

ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే తాజాగా రియల్ మీ 6ఐ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ అనుకోకుండా లిస్టింగ్ లో ఉంచి.. వెంటనే తొలగించింది. ఈ స‌మాచారం ప్ర‌కారం..  ఈ ఫోన్ రూ.15 వేల ధరలోనే లాంచ్ కానుంద‌ని తెలుస్తోంది. ఇక లీకైన స‌మాచారం ప్ర‌కారం  రియల్ మీ 6ఐ స్పెసిఫికేషన్లు చూస్తే..  6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు.  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ని ఇందులో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. కెమెరా విష‌యానికి వ‌స్తే.. రియ‌ల్ మీ 6ఐ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఇక 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇందులో అందిచారు. అలాగే 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: