ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తిఒక్క‌రి ఇంట్లోనూ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా పంచటం వల్లే టీవీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దీంతో డబ్బు ఉన్నవారు, లేనివారు అని తేడా లేకుండా వారి స్థాయిని బ‌ట్టి టీవీల‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌ల దగ్గర నుంచి మైక్రోమాక్స్ వంటి దేశవాళీ బ్రాండ్స్ వరకు వివిధ వేరియంట్‌లలో టీవీలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాల‌నుకునే వారికి గుడ్‌న్యూన్ అని చెప్పాలి.

 

ఎందుకంటే.. శాంసంగ్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీ లైనప్ ను లాంచ్ చేసింది. అదే క్రిస్టల్ 4కే అల్ట్రా హెడ్ డీ, అన్ బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ టీవీలు.  శాంసంగ్ క్రిస్టల్ 4కే అల్ట్రా హెచ్ డీ టీవీలు 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మల్టీ వ్యూ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా టీవీ స్క్రీన్ రెండు భాగాలుగా విడిపోయి.. రెండిట్లో రెండు వీడియోలు ప్లే అవుతాయి. ఇక శాంసంగ్ అన్ బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీలు 32, 43 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి.

 

అమెజాన్ అలెక్సా, వాయిస్ అసిస్టెంట్స్, శాంసంగ్ బిక్స్ బీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే.. అన్ బాక్స్ మ్యాజిక్ 3.0 రేంజ్ టీవీల్లో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.20,900 ఉండ‌గా.. 43 అంగుళాల వేరియంట్ ధర రూ.41,900గా నిర్ణ‌యించింది శాంసంగ్‌. అలాగే శాంసంగ్ క్రిస్ట్ 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ 43 అంగుళాల వేరియంట్ ధర రూ.44,400 ఉండ‌గా.. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.60,900, 65 అంగుళాల వేరియంట్ ధర  రూ.1,32,900, 75 అంగుళాల వేరియంట్ ధరను రూ.2,37,900గా నిర్ణ‌యించింది శాంసంగ్‌. ఇక ఈ రెండు టీవీలు బెజెట్ లెస్ డిజైన్, డైనమిక్ క్రిస్టల్ డిస్ ప్లే, క్రిస్టల్ 4కే ప్రాసెసర్లతో న‌డుస్తాయి. మ‌రో విశేషం ఏంటంటే.. ఈ స్మార్ట్‌టీవీల్లో ఓటీటీ యాప్స్ కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఉంది. కాబ‌ట్టి, స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఇదే త‌రుణం. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే కొనుగోలును ప్రారంభించండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: