రిలయన్స్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇంకా అలాంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 43వ వార్షిక సదస్సు రేపు జరగనుంది. ఇంకా ఈ వార్షిక దినోత్సవం నాడే జియో కొత్త ఫోన్ లాంచ్ కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జియో ఫోన్, జియో ఫోన్ 2లు కూడా కంపెనీ వార్షిక సదస్సులోనే లాంచ్ అవ్వడం వల్ల వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. 

 

IHG

 

2017 సంవత్సరంలోను వార్షికోత్సవం నాడు జియో ఫోన్ లాంచ్ అయ్యింది. ఆ ఫోన్ ధర 1,500 రూపాయిలు. 2018లో జియో ఫోన్ 2ను రిలియన్స్ 41వ వార్షిక సదస్సులో లాంచ్ చేశారు. దీని ధర రూ.2,999గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ జియో 3 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి కానీ, ధర గురించి కానీ ఇంతవరకూ ఎటువంటి వివరాలూ లీక్ అవ్వలేదు.                   

 

IHG

 

కానీ జియో ఫోన్ 3గా స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని మాత్రం ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ప్రస్తుతం ఇతర వెబ్ సైట్స్ లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కొన్ని లీక్ అయ్యాయి. ఈ సంవత్సరమే మిగతా కార్యక్రమాల తరహాలోనే ఈ కార్యక్రమం కూడా ఆన్ లైన్ లోనే జరగనుందని సమాచారం. మరి రేపు లాంచ్ అవుతుందా ? లేదా అనేది చూడాలి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: