క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. కంటికి క‌నిపించ‌కుండా.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. అలాగే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మునుపెన్నడూ లేనంత పతనాన్ని చవిచూసింది. అయితే ప్ర‌స్తుతం భార‌త్‌లో అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అవ్వ‌డంతో.. ప‌లు కంపెనీలు వ‌రుస పెట్టి ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. ఇక తాజాగా తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి రియ‌ల్‌మీ గుడ్‌న్యూస్ అందించింది.

 

కేవ‌లం రూ.8,000 లోపే రియల్‌మీ భార‌త్ మార్కెట్‌లో మ‌రో మోడల్‌ను విడుద‌ల చేసింది. అదే రియల్‌మీ సీ11. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ప‌నిచేస్తుంది. ఇందులో 2జీబీ+32జీబీ ఒక్క‌ వేరియంట్ మాత్ర‌మే అందించారు. ఇక రియల్‌మీ సీ11 స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 2జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. కెమెరా విష‌యానికి వ‌స్తే.. 13+2 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా ఉండ‌గా.. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

 

మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పాటు 5,000ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ నానో సిమ్ + ఎస్‌డీ కార్డ్ స్లాట్ సిమ్ సపోర్ట్ వంటి ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ ధ‌ర విషయానికి వ‌స్తే..  సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 మాత్రమే. ప్ర‌స్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రిచ్ గ్రీన్, రిచ్ గ్రే క‌లెర్స్‌లో అందుబాటులో ఉంది. ఇక జూలై 22 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో సేల్ మొదలవుతుంది. అలాగే రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000 ఎంఏహెచ్ కెపాసిటీతో కొత్త పవర్ బ్యాంకును కూడా విడుద‌ల చేసింది. దీని ధ‌ర ‌రూ.1,999.
 

మరింత సమాచారం తెలుసుకోండి: