స్మార్ట్‌ఫోన్ ప‌రిశ్ర‌మ‌లో రోజురోజుకు తీవ్ర పోటీ న‌డుస్తోంది. అదిరే ఆఫ‌ర్లు, అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అనేక బ్రాండ్లు ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. అయితే భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలో మంచి మార్కెట్ ను సంపాదించుకున్న సంస్థలలో వన్‌ప్లస్ ఒకటి. ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్లు తీసుకువ‌స్తున్న వ‌న్‌ప్ల‌స్‌.. జూన్ 21న వన్‌ప్లస్ నార్డ్ ను ఇండియాలో విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను విడుద‌ల‌ చేసిన వన్‌ప్లస్ తొలిసారి బడ్జెట్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ మోడ్‌ను పరిచయం చేయబోతోంది. 

 

ఇక ఈ ఫోన్ లాంఛింగ్‌కు సంబధించిన ప్రమోషన్లు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలోనే వన్ ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్లు తాజాగా అమెజాన్ ఇండియాలో ప్రారంభం అయ్యాయి.  ప్రీ ఆర్డర్ చేసే కస్టమర్లకు రూ.5,000 విలువైన బెనిఫిట్స్ కూడా ప్రకటించింది కంపెనీ. ప్రీ ఆర్డర్ చేసేవారికి ఓ గిఫ్ట్ బాక్స్ పంపించనుంది. అలాగే ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్ చేసి ఆగస్ట్ 31 లోగా ఫోన్ కొంటే మరో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఫోన్ ఆర్డర్ చేయాలంటే అమెజాన్ వెబ్ సైట్ కు వెళ్లి అందులో ఉన్న ప్రీ-ఆర్డర్ పేజ్ పై క్లిక్ చేయాలి. మ‌రియు రూ.499 పేమెంట్ చేసి వన్‌ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్ చేయాలి.

 

అలాగే వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇప్పటివరకు ఆన్ లైన్ లో ఎన్నో లీకయ్యాయి. వాటి ప్రకారం చూస్తే.. వన్ ప్లస్ నార్డ్‌లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే అందించిన‌ట్టు తెలుస్తోంది.  స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ ప్రాసెస‌ర్‌తో ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఇందులో 48+8+5+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండ‌గా.. 32+8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో అందించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో  4,115 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: