తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది.  తాజాగా షావోమి మరో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  ముఖ్యంగా బడ్జెట్‌ ధరల్లో రెడ్‌మి సిరీస్‌  స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్‌ చేసింది. రెడ్‌మి 6, 6ఏ, 6  ప్రో పేరుతో మూడు డివైస్‌లను  అక్కడి మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. 

రెడ్‌ మి 6   పలు వేరియంట్లలో, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌తో లాంచ్‌ చేసింది. 3జీబీ/32జీబీ వేరియంట్‌  ధరను సుమారు రూ. 8,500, 4జీబీ/64జీబీ రూ. 10,500,6జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ సుమారు 11వేల  రూపాయలకు లభ్యం.  


రెడ్‌ మి 6 ఫీచర్లు :
5.45 అంగుళాల  డిస్‌ప్లే
720 x 1440 రిజల్యూషన్‌
హీలియో పీ 22 ‍ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.1
12+5ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా
5ఎంపీ  సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌​ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: