మొబైల్ రంగంలో యాపిల్ ఫోన్ తో పోటీ పడే ఫోన్స్ ఏదన్నా ఉన్నాయంటే అవి వన్ ప్లస్ మొబైల్స్ అని చటుక్కున చెప్తారు మొబైల్స్ ప్రేమికులు. చైనాకి చెందిన ఈ మొబైల్స్ తయారీదారు. మార్కెట్ లోకి తన సీరీస్ లని విడుదల చేసిన కొద్ది కాలంలోనే మొబైల్ మార్కెట్ మొత్తాన్ని కబ్జా చేసిందనే చెప్పాలి. అయితే తాజాగా వన్ ప్లస్ నుంచీ మరో కొత్త సీరీస్ “వన్‌ప్లస్ 7” ని మే 14వ తేదీన విడుదల చేయనుంది.

 Image result for oneplus 7 series

ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. యూకే, అమెరికా , భారత్ మార్కెట్ లోకి కూడా అదే తేదేన  వన్‌ప్లస్ 7 సిరీస్ ఫోన్లు విడుదల అవనున్నాయి. ఇక ఇండియాలో బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ ఫోన్ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది.

 Image result for oneplus 7 series

వన్‌ప్లస్ 7 సిరీస్ ఫోన్లలో ఫీచర్స్ గమనిస్తే...

  • 6.7 ఇంచ్ డిస్‌ప్లే,
  • స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌,
  • 6/8/12 జీబీ ర్యామ్‌,
  • 128/256 జీబీ స్టోరేజ్‌,
  • 48, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
  • 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌,
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,
  •  వార్ప్ చార్జ్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: