ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది.  ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.  స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా పేస్ బుక్ ఉంటుంది.  పేస్ బుక్ లో అకౌంట్ లేని వ్యక్తులు చాలా తక్కువ అని చెప్పొచ్చు.  ఒక్కొక్కరికి రెండు మూడు అకౌంట్ లు కూడా ఉంటున్నాయి.  


మొదట చిన్నగా ప్రారంభమైన ఫేక్ బుక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంది.  కొత్త కొత్త ఫీచర్స్ తో దూసుకుపోతున్నది.  వచ్చే ఐదేళ్లలో సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది పేస్ బుక్.  రానున్న ఐదేళ్ళలో పేస్ బుక్ తన కార్యాలయాలలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచబోతున్నట్టు తెలిపింది.  


రానున్న అయిదేళ్లలో మా శ్రామికశక్తిలో కనీసం 50 శాతం మహిళలు, నల్లజాతీయులు, హిస్పానిక్‌, స్థానిక అమెరికన్లు, పసిఫిక్‌ ద్వీపవాసులు, ప్రత్యేక ప్రతిభావంతులు (దివ్యాంగులు), సీనియర్‌ సిటిజెన్స్‌ ఉండేలా కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని  ఫేస్‌బుక్‌ చీఫ్ డైవర్సిటీ అధికారిణి మాక్సిన్ విలియమ్స్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.


మహిళలు ఇచ్చిన వర్క్ ను ఇచ్చినట్టుగా చేస్తుంటారు.  ఒకసారి ఆఫీస్ లోకి అడుగుపెడితే మిగతా విషయాల గురించి పట్టించుకోరు.  పురుషులతో సమానంగా ఇంకా చెప్పాలి అంటే ఓ ఆకు ఎక్కువే పనిచేస్తారు.  అందుకే ఎక్కడ చూసినా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: