ఇప్పుడున్న జ‌న‌రేష‌న్‌లో ఇయ‌ర్‌ ఫోన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేనంతగా అవి మన జీవితంలో భాగాలైపోయాయి. వాటితో ఉపయోగాల మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరమైన సమస్యలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. అవేంటంటే...


ఇయర్‌ ఇన్‌ఫెక్షన్స్‌: చెవుల్లోపలికి దూరి ఉండే హెడ్‌ ఫోన్స్‌ వల్ల చెవి ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. హెడ్‌ ఫోన్స్‌ షేరింగ్‌ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి చెవి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. ఇతరుల హెడ్‌ఫోన్లు వాడుతూ ఉండే వారి చెవులను పరీక్షించినప్పుడు వాళ్లలో 98 మంది చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది. హెడ్‌ఫోన్‌ వాడకం వల్ల చెవుల్లో తలెత్తే వేడి , తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఓ గంటపాటు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుంటే ఆ సమయంలో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతున్నట్టు ప్రయోగాల్లో తేలింది.


హోరెత్తే సంగీతం: ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకున్నా మ్యూజిక్‌ సౌండ్‌ బయటికి వినిపిస్తోందంటే మనం అవసరానికి మించిన వాల్యూమ్‌ పెట్టుకున్నామని అర్థం. అధిక శబ్దం చెవిలోని నరాల పై పొర మెలీన్‌ షీత్‌ను దెబ్బ తీస్తాయి. ఈ పొర చెవి నుంచి శబ్ద తరంగాలను మెదడుకు చేరవేయటానికి ఉపయోగపడుతుంది. ఈ పొర దెబ్బతింటే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తి దెబ్బ తింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి గంటకోసారి హెడ్‌ ఫోన్స్‌ను చెవుల నుంచి తొలగిస్తూ ఉండాలి.


హెడ్‌ఫోన్స్‌ శుభ్రత: 4 వారాలకోసారి ఇయర్‌ బడ్స్‌ మారుస్తూ ఉండాలి. హెడ్‌ఫోన్స్‌, బడ్స్‌లను శానిటైజ్‌ చేస్తూ ఉండాలి. ఇతరులతో హెడ్‌ఫోన్స్‌ ఎక్స్‌చేంజ్‌ చేసుకోకూడదు. అలాగే తక్కువ మోతాదులో మ్యూజిక్‌ వింటూ గంటకోసారి చెవులకు విశ్రాంతినిస్తూ ఉంటే హెడ్‌ఫోన్స్‌ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: