రోజు రోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీతో మనిషికి ఎంత లాభం ఉందొ దానిని తప్పుగా ఉపయోగిస్తే నష్టం కూడా అంతే తీవ్రంగా కలిగిస్తుంది. నేడు అందరి మొబైల్స్ లో ట్రూకాలర్ యాప్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం ఎవరి మొబైల్ లో అయితే ట్రూకాలర్ ఉంటుందో వాళ్ళ ఫోన్ కి ఎవరైనా అవతలి వ్యక్తి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ట్రూకాలర్ యాప్ లో కనిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా దీనిపై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి.


కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా లీకైంది. జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్‌వెబ్‌లో దొరుకుతోందని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్.. ఇలా మొత్తం పలు రకాల డేటాను ఎవరైనా పొందొచ్చు. మరో షాకింగ్ విషయం ఏంటంటే లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులదే అని అనుమానం. 


ట్రూకాలర్ యూజ‌ర్స్ ఇది అంత సేఫ్ కాదని, ఎప్పుడైనా హ్యాక్ అయ్యే అవకాసలున్నాయని గుర్తించారు. గత కొంతకాలంగా కొంతమందికి ఈమైల్స్, ఫోన్ కాల్స్ స్పామ్ చేసి మీకు పలానా కంపెనీ నుండి లాటరీ తగిలిందని, ఆ డబ్బును మీకు పంపించాలంటే సర్వీస్ చార్జ్ నిమిత్తం కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని లేదా మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే దానికి ఎమౌంట్ పంపిస్తామని గాలం వేసి డబ్బు నొక్కేస్తున్నారు.  ట్రూకాలర్ తప్పుగా వాడడం వల్ల అమాయకమైన, ఏవిధమన సంభందం లేని వారికి కూడా నష్టం కలుగుతుంది. అందుకే ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించ‌లి.



మరింత సమాచారం తెలుసుకోండి: