ఇటీవ‌ల వాట్స‌ప్‌కు ప్రాధ‌న్య‌త పెరిగిపోతుంది. దీనికి త‌గ్గ‌ట్టు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ యూజర్లను ఆకర్షిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ల‌ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. స‌హ‌జంగా ఉదయం నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్ తీసుకొని వాట్సప్ మెసేజ్‌లు చెక్ చేసుకోవ‌డం... రాత్రి పడుకునే ముందు వ‌ర‌కు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో వాడుతూనే ఉంటారు. 


ఈ క్ర‌మంలోనే యూజ‌ర్ల‌కు ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఫేస్‌బుక్ దీన్ని అప్‌డేట్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా మ‌రో ఫీచ‌ర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇది వాట్స‌ప్ యూజ‌ర్ల‌కు నిజంగా శుభ‌వార్తే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఎఫ్8 డెవలపర్ సమావేశంలో ఓ విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేంటంటే ఇక నుంచి వాట్సాప్ నుంచే డైరెక్ట్‌గా షాపింగ్ చేయొచ్చు అనే గుడ్ న్యూస్‌ను ప్ర‌క‌టించారు.


 దీని వ‌ల్ల  చిన్న వ్యాపారులు లక్షల మంది యూజర్లకు చేరువ కావొచ్చు. అలాగే వ్యాపారుల కొర‌కు ప్రొడక్ట్ కేటలాగ్స్‌ ఫీచర్ తీసుకువస్తామని తెలిపారు. దీంతో వాట్సాప్ నుంచే డైరెక్ట్ షాపింగ్ చేయొచ్చు. ఈ న్యూ ఫీచ‌ర్ వ‌ల్ల చిన్న చిన్న వ్యాపారుల‌కు చాలా ఉప‌యోగ‌క‌రం. మ‌రియు వ్యాపారుల యొక్క వాట్సాప్ ప్రొఫైల్స్‌లో ప్రొడక్ట్ కేటలాగ్స్ కనిపిస్తాయి. 


వీటిని ఎవ‌రైనా చూసి న‌చ్చితే కొనుగోలు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ప్ర‌స్తుతం వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్స్ ఫీచర్‌ను ప‌రిశీలించుకుంటుంది. అలాగే ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు అందుబాటులో రావ‌డానికి మ‌రి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: