చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో సాంకేతిక కారణాల వల్ల విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ప్రపంచం నలుమూలల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే..చివరి నిమిషంలో సమస్య వచ్చిపడినందుకు  ఎలాంటి అధైర్య  పడవద్దని ప్రధాని నంద్రమోడీ తెలిపిన విషయం తెలిసిందే. అయితే అటు దేశ ముఖ్య నేతలు, ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలో ఎంతో ధైర్యం నింపారు. అలాగే  ‘స్థైర్యాన్ని కోల్పోవద్దు’ అంటూ ఆంజనేయ కౌల్‌ అనే పదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలుడు రాసిన లేఖలో ఏముందో..దాని పూర్తి సారాంశం ఓసారి చూసేద్దాం.

 

“అంత త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుడిని తప్పకుండా చేరుకకుంటాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న ‘చంద్రయాన్‌-3’ మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా అక్కడే (చంద్రుడి కక్ష్యలో) ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు తెలియజేస్తుంది. విక్రమ్‌ ఖచ్చితంగా ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. ‘ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం.’ దేశం తరఫున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్‌..అంటూ లేఖను రాశాడు ఆ బాలుడు. ఆ లేఖ రాసిన బాలుడిని అందరు ప్రశంసిస్తున్నారు.  కాగా..సాంకతిక సమస్య తలెత్తిన సమయంలో టెన్షన్ పడ్డ శాస్త్రవేత్తలు..తర్వాత విక్రమ్ ఎక్కడుందో కనుక్కొంటామని చెప్పారు. వారు చెప్పినట్లుగానే విక్రమ్ ఆచూకీ దొరకిందని, సిగ్నల్స్ ను పునరుద్దరించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ఆచూకీ లభించడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఊపిరి పోసినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: