ఇప్పుడు బిగ్ డేటా అనేది అత్యధిక ఉద్యోగాలు అందిస్తున్న రంగంగా మారింది. టెక్నాలజీ యుగంలో డేటా పై పట్టు ఉన్నవారిదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లోలని ఇక్రిశాట్ వేదికగా బిగ్ డేటా సదస్సు జరగబోతోంది. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ ప్రాంగణంలో ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ కార్య క్రమం జరగనుంది.


ఈ బిగ్ డేటా సదస్సులో డిజిటల్ వ్యవసాయంపై నమ్మకాన్ని పెంచే దిశగా దేశవిదేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకుంటారు. 'ట్రస్ట్-హ్యుమన్, మెషిన్స్' పేరిట నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకాన్నుట్లు ఇక్రిశాట్ తెలిపింది.


2019 ఇన్ స్పైర్ ఛాలెంజ్ లో భాగంగా 140కి పైగా ప్రతిపాదనలు వీరికి అందాయి.ఇందులో నుంచి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు. ఎంపిక చేసిన ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి లక్ష యూఎస్ డాలర్లను అందిస్తారు. డేటా సైన్స్ లో నిపుణులు, శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, స్థానిక రైతులు కలిసి ఆహార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని కోణాల్లోనూ చర్చిస్తారు.


బిగ్ డేటా టూలను ఉపయోగించి చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపకరించే ప్రాజెక్టులను గుర్తించనున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోవాలనుకునే వారు అరుదుగా జరిగే ఇలాంటి సదస్సులు అస్సలు మిస్ కాకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: