వాట్సాప్ వినియోగదారులు కొందరు రెండు వాట్సాప్ అకౌంట్లను వినియోగిస్తుంటారు. కానీ ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్ల కోసం వాట్సాప్ అప్లికేషన్ లో లాగ్ ఔట్ చేసి లాగ్ ఇన్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తే ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్లను వేరు వేరుగా ఉపయోగించవచ్చు. వాట్సాప్ అనే కాదు వేరే ఏ యాప్ అయినా కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు. ఒకే ఫోన్ లో ఒక యాప్ ని రెండుగా ఉపయోగించటాన్ని పారలల్ స్పేస్ అంటారు. 
 
సాధారణంగా కొన్ని ఫోన్లలో ఒకే యాప్ రెండు అకౌంట్లతో ఉపయోగించుకోవటానికి స్పెషల్ ఆప్షన్స్ ఉంటాయి. శాంసంగ్ లో డ్యూయెల్ మెసేంజర్, షావోమీ ఫోన్లలో డ్యూయెల్ యాప్స్, వివోలో యాప్ క్లోన్, ఒప్పోలో క్లోన్ యాప్స్ హానర్, హువావే ఫోన్లలో యాప్ ట్విన్ అనే అప్లికేషన్లను ఉపయోగించి రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసిన ఫోన్ లో మొదట ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ యాప్ ట్విన్/ క్లోన్ యాప్ / డ్యూయెల్ యాప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత అక్కడ కనిపించే యాప్స్ నుండి వాట్సాప్ ఎంచుకోవాలి. ఈ విధంగా చేస్తే రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. 
 
ఒకవేళ మీరు సెట్టింగ్స్ లో ఈ యాప్స్ లేని ఫోన్ వినియోగిస్తున్నట్లు అయితే ప్లే స్టోర్ లో పారలల్ స్పేస్, డబుల్ యాప్, డ్యూయెల్ యాప్ విజార్డ్ లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని రెండవ వాట్సాప్ సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వినియోగదారులు వాట్సాప్ బిజినెస్ అనే యాప్ ఉపయోగించి రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించవచ్చు. ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించాలనుకునే వినియోగదారులు ఈ విధంగా తేలికగా రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించవచ్చు. వాట్సాప్ మాత్రమే కాదు ఇతర అప్లికేషన్లు కూడా ఇదే విధంగా ఉపయోగించుకోవచ్చు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: