మొదట కొద్దిపాటి మోడల్స్ తో  కొన్నేళ్ల క్రితం భారత మొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన షావోమీ సంస్థ, మెల్లగా ఒక్కొక్కటిగా మోడల్స్ ని రిలీజ్ చేస్తూ ఇక్కడి మొబైల్ మార్కెట్ లో తన సత్తాను చాటడం మొదలెట్టింది. నిజానికి తొలుత అత్యధిక ఫీచర్స్ తో అత్యల్ప ధరల్లో మొబైల్స్ ని యూజర్స్ కు అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ షావోమీ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం భారతీయ మొబైల్ రంగంలో అత్యధిక సేల్స్ వాటాతో దూసుకెళ్తున్న ఈ సంస్థ, తమ యూజర్స్ కోసం ఒక సరికొత్త అప్ డేట్ వర్షన్ ని అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు షావోమీ రెడ్మి మొబైల్స్ లో పదవ వెర్షన్ వరకు అందుబాటులో ఉండగా, ఇటీవల MIUI 11 పేరిట సరికొత్త వర్షన్ ని అందుబాటులోకి తెచ్చింది షావోమీ సంస్థ. ఇక ఈ న్యూ వర్షన్ లో గతంలో కంటే ఎంతో యూజర్ ఫ్రెండ్లీ గా తీసుకురావడం జరిగింది. గత వర్షన్ తో పోలిస్తే ఇందులో బ్లోట్ వేర్ తగ్గించడం, అలానే స్క్రీన్ సేవర్ గా మనకు నచ్చిన కోట్స్  రాసుకునే అవకాశం కల్పించారు. 

దానితో పాటు కాంటాక్ట్స్ మెనులో ఏదైనా ఒక కాంటాక్ట్ ని సెలెక్ట్ చేస్తే మనకు ఫుల్ స్క్రీన్ లో ఆ కాంటాక్ట్ తాలూకు డీటెయిల్స్ అన్ని కనపడడేలా ఫుల్ స్క్రీన్ ఎక్స్ పీరియెన్స్ ని అందించారు. ఇక ఇప్పటివరకు మనకు మొబైల్ స్క్రీన్ పై మొబైల్ నోటిఫికేషన్స్ అనేవి స్క్రీన్ కి పైన లేదా కింద కనపడేవి, అయితే ఈ వర్షన్ లో కొంత మార్పు చేసి, స్క్రీన్ కు ఎడమ లేదా కుడివైపు చిన్న మెరుపులు మాదిరిగిగా ఇకపై నోటిఫికేషన్స్ మనకు కనపడతాయి. అలానే డైనమిక్ వాల్ పేపర్ అనే కొత్త విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. దానివలన ఇకపై మోషన్ బేస్డ్ పిక్చర్స్, అంటే వీడియోస్ లేదా జిఐఎఫ్ లు వంటివి కూడా వాల్ పేపర్స్ గా అమర్చుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఫైల్ మేనేజర్ లో మనం ఎంచుకునే ఫోల్డర్ లోని అంశాలు డాక్యుమెంట్స్  రూపంలో కనపడడం వలన, ఆ ఫైల్స్ లో ఏముందో తెలుసుకోవడానికి దానిని ఓపెన్ చేయవలసి వచ్చేది,

అయితే ఈ వర్షన్లో అటువంటి ఇబ్బంది లేకుండా, ఫైల్ మేనేజర్ లో థంబ్ నెయిల్ వ్యూని తీసుకురావడంతో, ఈ ప్రివ్యూ ద్వారా డాక్యుమెంట్ లోని డీటెయిల్స్ ని ప్రివ్యూ లోనే తెలుసుకోవచ్చు. అలానే మనం రాసుకునే నోట్స్ యాప్ ని ప్రతి సారి ఓపెన్ చేయకుండా డెస్క్ టాప్ లో ఎడమ నుండి కుడివైపుకు స్వైప్ చేసి నోట్స్ షార్ట్ కట్స్ ఓపెన్ చేయవచ్చు. అలానే అందులో ఇన్ పిక్చర్ ఆప్షన్ ద్వారా మనం చేయాలనుకున్న క్యాలిక్యులేషన్స్ వంటివి ఇకపై నోట్స్ లోనే చేసుకోవచ్చు. దానితో పాటు క్యాలిక్యులేటర్ లో మరిన్ని ఫీచర్స్ పొందుపరచడం జరిగింది. వాకింగ్ కి వెళ్లేవారికి, అలానే ముఖ్యగా ఆడవారికి మెనుస్ట్రువల్ సైకిల్ ప్రతి నెలా లెక్కించి దానిని క్యాలెండర్ కి సింక్ చేసే విధంగా ఏర్పాటు చేసారు. 
గేమ్స్ ఆడేటపుడు కాల్ వస్తే, వెంటనే కాలింగ్ స్క్రీన్ ఓపెన్ అయి, గేమ్ స్క్రీన్ మినిమైజ్ అవడం పాత వెర్షన్స్ లో ఉండగా, దాని స్థానే ఇకపై గేమ్స్ ఆడేటప్పుడు కాల్ వస్తే ఆ కాల్ ఐకాన్ మొబైల్ స్క్రీన్ కి ఎడమవైపున కనపడుతుంది. అలానే ఏదైనా వీడియో చూసేటపుడు వాట్సాప్ వంటి యాప్స్ నుండి మెసేజ్ లు వస్తే, దానిని మినిమైజ్ చేసి రిప్లై ఇవ్వాల్సి వచ్చేది, అయితే అటువంటి అవసరం లేకుండా స్మార్ట్ రిప్లై పేరుతో తీసుకువచ్చిన నూతన ఫీచర్ తో, మనకు ఏదైనా యాప్ నుండి మెసేజ్ వస్తే, అది వెంటనే మన స్క్రీన్ పై పిక్చర్ ఇన్ పిక్చర్ గా ఓపెన్ అయి, దాని ద్వారా అక్కడి నుండే రిప్లై ఇవ్వొచ్చు. ఇక ఈ విధమైన సరికొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చిన ఈ న్యూ వర్షన్ ని ఇప్పటికే పలువురు ఎంఐ యూజర్స్ డౌన్లోడ్ చేయడం మొదలెట్టారు. కాగా ఈ వర్షన్ ప్రస్తుతం కొన్ని రకాల షావోమీ మొబైల్ లో మాత్రమే అందుబాటులో ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: