ISIS కార్యకలాపాలపై నిఘా వెయ్యబడిందని ఆ సంస్థ భయపడుతోందా? అవుననే తాజా ఉదంతం తెలియజేస్తోంది.

తాజా టెక్నాలజీని తమ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవడంలో ISIS ఎప్పుడూ ముందు ఉంటోంది. అయితే సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు సక్రమంగా తీసుకోపోవడం వల్ల ఈ సంస్థ గతంలో పలుమార్లు అభాసుపాలు అయింది. తాజాగా మరో సంఘటన చూద్దాం.

ISIS ఉగ్రవాద సంస్థ ఏపిల్ iOS ప్లాట్‌ఫాం కన్నా Androidని ఎక్కువ ఇష్టపడుతుంది. దీనికి కారణం iOSలో తప్పనిసరిగా Apple App Store నుండి మాత్రమే అప్లికేషన్లని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఇతర సోర్సుల నుండి ఇన్‌‌స్టాల్ చేసుకోవాలంటే ఫోన్‌ని జైల్‌బ్రేక్ చేసి .IPA ఫైళ్లని డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అదే ఆండ్రాయిడ్‌లో అయితే ఈ తతంతం ఏమీ లేకుండానే అప్లికేషన్ల యొక్క .apk ఫైళ్లని sideload చేసుకోవచ్చు.

ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే ISIS సంస్థ ఇప్పటివరకూ ఆరు ఆండ్రాయిడ్ అప్లికేషన్లని తమ సభ్యుల కోసం తయారు చేసుకుంది. వాటిని Google Play Storeలో పొందుపరచడానికి సాధ్యపడదు. అందుకే వాటిని Amaq Channels అనే వారి స్వంత అధికారిక ఛానెల్స్ ద్వారా ISIS సభ్యులకు అందుబాటులో ఉంచుతున్నారు.

అయితే ఈ ఛానెల్ తరచూ డౌన్ అవుతూ ఉండడం వల్ల ISIS సభ్యులు ఆయా యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి నెట్‌లోని ఇతర మిర్రర్ సైట్లపై ఆధారపడుతున్నారు. ఆయా సైట్ల నుండి డౌన్‌లోడ్ చేసుకునే ఆండ్రాయిడ్ యాప్స్‌ని హ్యాకర్లు మోడిఫై చేసి స్పైవేర్‌ని నిక్షిప్తం చేసినట్లు అనుమానంగా ఉందని ISIS తాజాగా భయపడుతోంది. అందుకే వారి అధికారిక Amaq Channelsన నుండి  కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర సోర్సుల నుండి అప్లికేషన్లని డౌన్‌లోడ్ చేసుకోవద్దని తన సభ్యులకు ఓ హెచ్చరిక జారీ చేసింది.

ఉగ్రవాదంతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్.. టెక్నాలజీ పరంగానూ దూసుకుపోతున్నామని విర్రవీగుతున్న సంస్థ కనీసం నిరంతరం పనిచేసే డౌన్‌లోడ్ సర్వర్లని నిర్వహించుకోలేని దుస్థితిలో ఉందంటే, ఆ సంస్థ సభ్యులు ఐసిస్ యాప్స్ డౌన్‌లోడ్ల కోసం మిర్రర్ సైట్లపై ఆధారపడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!



మరింత సమాచారం తెలుసుకోండి: