ఇక వాట్సప్ ఛాట్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్లు పోబోతున్నాయి. అవతలి వారు మాట్లాడిన దానికి అక్కడికక్కడే రిప్లైలు ఇచ్చే సదుపాయాన్ని వాట్సప్ తాజాగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఛాటింగ్ మరింత స్పష్టంగా చేసుకోవచ్చన్నమాట.

వాట్సప్ బీటా వెర్షన్ 2.16.118లో Message Quotes and Replies అనే సరికొత్త సదుపాయం ప్రవేశపెట్టబడింది. సహజంగా మనం వాట్సప్‌లో మన ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసేటప్పుడు అవతలి వారు నాలుగైదు క్వశ్చన్లు టకాటకా అడిగేశాక మనం ఇచ్చే రిప్లై మొత్తం ఛాట్ కన్వర్‌జేషన్‌కి అడుగున వెళ్లిపోయి ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఇచ్చామో అవతలి వారికి అర్థం కాని గందరగోళ స్థితి ఏర్పడుతుంది కదా.

ఈ "మెసేజ్ కోట్స్, రిప్లైస్" ఆప్షన్‌ ద్వారా మనం వాట్సప్‌ ఛాట్‌లో ఏ మెసేజ్‌నైనా ఎంచుకుని కేవలం దానికి మాత్రమే ఆన్సర్ చేయొచ్చు. మనం ఏ మెసేజ్‌కి ఆన్సర్ చేస్తున్నామో ఆ మెసేజ్ కోట్ చెయ్యబడి దాని క్రింద మనం టైప్ చెయ్యబడిన ఆన్సర్ అవతలి వారికి కన్పిస్తుంది.

ఛాట్ సంభాషణల్లో పాల్గొనే ఇరువురు వ్యక్తులకు ఏ మెసేజ్‌కి మనం రిప్లై ఇస్తున్నామో స్పష్టత రావడం కోసం ఈ కొత్త సదుపాయం ఉపయోగపడుతుంది. వాట్సప్ Beta వెర్షన్ వాడుతున్న వారికి మాత్రమే ఇది లభిస్తుంది. వాట్సప్ Beta ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలు మీరూ పొందాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్‌లో Beta అప్‌డేట్లకి సబ్‌స్కైమ్ చేసుకోవలసి ఉంటుంది. వాట్సప్ అఫీషియల్ ఫైనల్ వెర్షన్‌కి ఈ సదుపాయం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: