ఫేస్‌బుక్ మరోసారి పప్పులో కాలేసింది. గతంలో కొత్త కొత్త ఫీచర్లని అందుబాటులోకి తీసుకు రాబోయి తప్పులు చేసిన Facebook ఈరోజు మరో పెద్ద తప్పు చేసేసింది. సహజంగా వివిధ దేశాల స్వాతం త్య్ర దినాలప్పుడు ఆయా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపడానికి Facebook జెండాతో దర్శనమిస్తుంది కదా. ఫిలిప్ఫీన్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఓ పెద్ద తప్పు చేసేసింది.

ఫిలిప్ఫీన్స్ 118వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ఫిలిప్ఫీన్స్‌లో నివశించే ఫేస్‌బుక్ యూజర్లని వారి దేశపు జాతీయ జెండాతో పలుకరించి ఫేస్‌బుక్. అయితే ఆ జెండాని చూసిన ఫిలిప్ఫీనియన్లు షాక్ అయ్యారు. జాతీయ పతాకం ఉండవలసిన దానికి భిన్నంగా తిరగ తిప్పబడి దర్శనమిచ్చింది.


ఎరుపు, బ్లూ, తెలుపు, పసుపు రంగులతో ఉండే జాతీయ జండాలో ఎరుపు క్రిందివైపు ఉండాల్సి ఉండగా Facebook తన విషెస్‌లో దాన్ని పైకి డిజైన్ చేసింది. ఫిలిప్ఫీనియన్లు ఇలా ఎరుపుని పైన ప్రదర్శించడాన్ని యుద్ధానికి చిహ్నంగా భావిస్తారు. దీంతో భారీ ఎత్తున ఆ దేశ ప్రజలు ఫేస్‌‌బుక్‌పై విరుచుకు పడడం మొదలెట్టారు.

ఈ తప్పిదం గురించి ఫేస్‌‌బుక్‌ని సంప్రదించగా ఫేస్‌‌బుక్ నుండి ఎలాంటి స్పందనా లభించలేదు. ఫేస్‌‌‌బుక్ ఇలా మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాల విషయంలో ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: